ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్రీన్ టీని తాగుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. రోజూ గ్రీన్ టీని తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే గ్రీన్ టీ మంచిదే కానీ దీన్ని అతిగా తాగరాదు. రోజుకు రెండు కప్పుల కన్నా ఎక్కువగా గ్రీన్ టీని తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో అనీమియా (రక్తహీనత) వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే టానిన్స్ అనే సమ్మేళనాలు శరీరం ఐరన్‌ను గ్రహించకుండా చేస్తాయి. దీంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య వస్తుంది.
2. గ్రీన్ టీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కాఫీ, టీ ల కన్నా అధిక మోతాదులో కెఫీన్ గ్రీన్ టీలో ఉంటుంది. కనుక రోజుకు రెండు కప్పుల కన్నా ఎక్కువగా గ్రీన్ టీని తాగితే గుండె కొట్టుకోవడంలో తేడాలు వస్తాయి. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. ఇది గుండె సమస్యలను కలగజేసే అవకాశం ఉంది.
3. గ్రీన్ టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని ఎక్కువగా తాగితే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతోపాటు కడుపునొప్పి, కడుపులో మంటి వంటి సమస్యలు వస్తాయి.
4. తలనొప్పి ఎక్కువగా ఉండేవారు గ్రీన్ టీని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. కానీ గ్రీన్ టీని ఎక్కువగా సేవిస్తే తలనొప్పి తగ్గకపోగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక దాన్ని మోతాదులోనే తీసుకోవాలి.
5. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల నిద్ర లేమి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ టీని ఎక్కువగా తాగితే మన శరీరంలో కెఫీన్ ఎక్కువగా చేరుతుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. కనుక గ్రీన్ టీ మోతాదుకు మించితే నిద్ర సమస్యలు వస్తాయి. అందువల్ల దీన్ని తక్కువగా తాగాలి.
6. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల అలర్జీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నాలుక, గొంతు, పెదవులు దురదగా అనిపిస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365