Categories: పోష‌ణ‌

కాడ్‌ లివర్‌ ఆయిల్‌ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

కాడ్‌ లివర్‌ ఆయిల్‌. ఇది పోషకాలతో కూడిన చేపనూనె. కాడ్‌ ఫిష్‌ అనే చేపల లివర్‌ నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. అందుకనే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆయిల్‌ సప్లిమెంట్లను డాక్టర్లు రోగులకు సూచిస్తుంటారు. ఈ సప్లిమెంట్లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో అధిక మొత్తాల్లో విటమిన్‌ ఎ, డిలు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల అనేక లాభాలు కలుగుతాయి. దీంతో వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

health benefits of cod liver oil

1. కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్‌, బీపీ రాకుండా అడ్డుకోవచ్చు. ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనం అవుతాయి.

2. కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఈ సప్లిమెంట్లలో ఉండే విటమిన్‌ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఎముకల సమస్యలను తగ్గిస్తుంది. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

4. ఆర్థరైటిస్‌ నొప్పులు ఉన్నవారు ఈ సప్లిమెంట్లు తీసుకుంటే మంచిది. దీంతో వాపులు, నొప్పులు తగ్గుతాయి.

5. ఈ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. గ్లకోమా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

6. కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ట్రై గ్లిజరైడ్స్‌ స్థాయిలు తగ్గుతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. రక్తనాళాల్లో ప్లేక్‌ చేరకుండా ఉంటుంది. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు.

7. కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లలో విటమిన్లు డి, ఎ లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

8. ఈ సప్లిమెంట్లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు ఎ, డి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ నాశనమవుతాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

కాడ్‌ లివర్‌ ఆయిల్‌ సప్లిమెంట్లు లిక్విడ్‌, కాప్సూల్‌ ఫార్మాట్లలో లభిస్తున్నాయి. లిక్విడ్‌ అయితే రోజుకు 1 లేదా 2 టీస్పూన్లు తీసుకోవాలి. అదే కాప్సూల్స్‌ అయితే రోజుకు ఒకటి చాలు. బీపీ లేదా రక్తాన్ని పలుచన చేసే మందులను వాడేవారు, గర్భిణీలు డాక్టర్‌ సలహా మేరకు ఈ సప్లిమెంట్లను వాడుకోవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts