Dry Amla : శ‌రీరంలో వ‌ణుకు, న‌రాల బ‌ల‌హీన‌త‌, షుగ‌ర్‌.. అన్నీ మాయం..!

Dry Amla : ఉసిరికాయ‌లు మ‌న‌కు ఎక్కువ‌గా చ‌లికాలంలో ల‌భిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వేరే రోజుల్లో మ‌న‌కు ఉసిరి కాయ జ్యూస్ దొరుకుతుంది. అయితే ఉసిరి కాయ‌ల‌ను ఎండ బెట్టి ముక్క‌ల‌ను కూడా విక్ర‌యిస్తుంటారు. వీటినే డ్రై ఆమ్లా లేదా ఆమ‌ల‌కి అని కూడా అంటారు. ఇవి మ‌న‌కు ఎప్పుడు అయినా స‌రే సూప‌ర్ మార్కెట్ల‌లో ల‌భిస్తాయి. ఆయుర్వేద మందుల షాపుల్లోనూ వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ఉసిరికాయ‌ల మాదిరిగానే ఎండిన ఉసిరికాయ‌ల‌ను కూడా మ‌నం తీసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు బోలెడు లాభాలు క‌లుగుతాయి. డ్రై ఆమ్లా వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండ బెట్టిన ఉసిరి ముక్క‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో ఉండే విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా ప‌నిచేస్తుంది. ఇది ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారి నుంచి శ‌రీరాన్ని ర‌క్షిస్తుంది. దీంతో క‌ణ‌జాలం సుర‌క్షితంగా ఉంటుంది. ఎండిన ఉసిరికాయ‌ల్లో అధిక మొత్తంలో విట‌మిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని సైతం పెంచుతుంది. దీని వ‌ల్ల శ‌రీరం ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తుంది. దీంతో ద‌గ్గు, జ‌లుబు వంటి సీజ‌నల్ వ్యాధులు రావు. ఎండిన ఉసిరి ముక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. అజీర్తి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

Dry Amla many wonderful benefits take daily
Dry Amla

ఉసిరి ముక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల శిరోజాలు ఆరోగ్యంగా మారి పొడ‌వుగా పెరుగుతాయి. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో జుట్టు దృఢంగా మారుతుంది. శిరోజాలు కాంతివంత‌మ‌వుతాయి. ఎండిన ఉసిరి ముక్క‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. దీని వ‌ల్ల వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు ఏర్ప‌డ‌వు. అలాగే మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఎండిన ఉసిరి ముక్క‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు. అందువ‌ల్ల వీటిని తింటుంటే డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఎండిన ఉసిరి ముక్క‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని, వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె జ‌బ్బులు రావు. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఎండిన ఉసిరి ముక్క‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ఆందోళ‌న‌, వ‌ణుకు, మ‌తిమ‌రుపు వంటి స‌మ‌స్య‌లు అన్నీ త‌గ్గుతాయి. క‌నుక రోజూ ఎండిన ఉసిరి ముక్క‌ల‌ను తినాలి. వీటిని రోజుకు 4 – 5 తిన్నా చాలు.. ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

Editor

Recent Posts