జీడిపప్పు.. దీన్నే కాజు అని కూడా అంటారు. ఇవి సాలిడ్‌గా ఉంటాయి. మృదువుగా చక్కని రుచిని కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వేస్తుంటారు. మసాలా వంటకాలతోపాటు స్వీట్లలోనూ జీడిపప్పును వేస్తుంటారు. దీంతో వాటికి చక్కని రుచి వస్తుంది. జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తింటే ఎంతో శక్తి లభిస్తుంది. అయితే జ్ఞాపకశక్తి పెరగాలని చూసే వారు, మెదడు యాక్టివ్‌గా చురుగ్గా మారాలని అనుకునే వారు ఈ పప్పును ఉదయం పరగడుపునే తినాల్సి ఉంటుంది.
4 జీడిపప్పును ఉదయం పరగడుపున తినాలి. తరువాత వెంటనే ఒక టీస్పూన్ తేనెను తీసుకోవాలి. ఇలా 1 నెలలో 15 రోజుల పాటు చేయాలి. 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 15 రోజులు చేయాలి. దీంతో మెదడు కణాలకు శక్తి లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత రెట్టింపవుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది.
జీడిపప్పును అలా పరగడుపున తినడం వల్ల మెమొరీ పవర్ పెరగడమే కాదు, జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఇలా తినడం మంచిది. దీంతోపాటు శరీరంలో పీహెచ్ స్థాయిలు తగ్గుతాయి. జీడిపప్పులో ఉండే అనేక రకాల బి విటమిన్లు మెమొరీ పవర్‌ను పెంచుతాయి.