హెల్త్ టిప్స్

Garlic : వెల్లుల్లి మంచిదే కానీ.. అధికంగా తీసుకుంటే ప్ర‌మాదం..!

Garlic : చాలా మంది వంటల్లో వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. వెల్లుల్లిని వంటల్లో వాడ‌డం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వెల్లుల్లితో అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లిని ఉపయోగించడం వలన పలు రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లి వలన చాలా సమస్యలు దూరం అవుతాయ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి వెల్లుల్లి వలన ఎటువంటి లాభాల‌ని పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

లివర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి, లివర్ బాగా పని చేయడానికి వెల్లుల్లి సహాయం చేస్తుంది. రోజు కొంచెం వెల్లుల్లి తీసుకుంటే, లివర్ బాగుంటుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకుంటే, వికారం, వాంతులు వంటి బాధలు ఉండవు. గుండెల‌లో మంట కూడా తగ్గుతుంది. కాబట్టి, వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. అలానే మీరు వెల్లుల్లి తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరమవుతాయి.

excessive consumption of garlic is unhealthy to us

వెల్లుల్లిని తీసుకుంటే, గ్యాస్ట్రిక్ కాన్సర్ ని నిరోధించడానికి కూడా వీల‌వుతుంది. వెల్లుల్లి ద్వారా రక్తపోటుని కూడా తగ్గించుకోవచ్చు. రక్తపోటు ఉన్న వాళ్లు వెల్లుల్లి తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. కొంతమంది వెల్లుల్లి తీసుకోవడం మంచిది కాదు. బ్లడ్ థిన్నర్స్ ని వాడే వాళ్ళు, వెల్లుల్లి తీసుకుంటే, రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది.

శస్త్ర చికిత్స అయిన ఏడు రోజులు తర్వాత మాత్రమే వెల్లుల్లి తీసుకోండి. అప్పటి వరకు మానేయండి. వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే, చర్మంపై సమస్య వస్తుంది. ఎలర్జీలు వంటివి కూడా రావచ్చు. వెల్లుల్లిని ఎక్కువ‌గా పచ్చిగా తీసుకోవడం వలన మైగ్రేన్ వస్తుంది. ఎక్కువగా వెల్లుల్లి తీసుకుంటే, దృష్టి లోపాలు కూడా కలగొచ్చు. సమస్యలు ఏమీ లేనివాళ్లు వెల్లుల్లిని రెగ్యులర్ గా వాడచ్చు. అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Share
Admin

Recent Posts