Fast Eating : ప్రతి రోజూ మనం సాధారణంగా మూడు పూటలా భోజనం చేస్తుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తుంటారు. కొందరు రాత్రి పూట భోజనాన్ని త్వరగా ముగించేస్తారు. కొందరు రాత్రి కేవలం పండ్లనో లేదా చపాతీలనో తింటారు. ఇలా ఎవరి రుచులు, ఇష్టాలు వారికి ఉంటాయి. అయితే చాలా మంది ప్రస్తుతం భోజనాన్ని వేగంగా తింటున్నారు. ఏదైనా హడావిడిలోనో లేదా పనిలోనో ఉండి భోజనాన్ని వేగంగా చేస్తున్నారు. దీంతో అనేక అనర్థాలు సంభవిస్తాయి. భోజనాన్ని వేగంగా తినడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనాన్ని వేగంగా తినడం వల్ల అధికంగా ఆహారం తీసుకుంటారు. ఫలితంగా శరీరంలో అధిక ఆహారం కొవ్వుగా మారుతుంది. ఇది బరువును పెంచుతుంది. దీంతో స్థూలకాయం వస్తుంది. ఫలితంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆహారాన్ని వేగంగా తింటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం సమస్యలు వస్తాయి. దీంతోపాటు దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అప్పుడు ఎన్ని మందులను వాడినా ఫలితం ఉండదు. కనుక భోజనాన్ని నెమ్మదిగా తినాలి.
ఇక ఒక అధ్యయనం ప్రకారం.. భోజనాన్ని వేగంగా చేసేవారిలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కనుక ఈ అలవాటు ఉన్నవారు వెంటనే దీని నుంచి బయట పడాలి. లేదంటే డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఆహారాన్ని వేగంగా తినడం వల్ల అది సరిగ్గా జీర్ణం కాదు. దీంతో మన శరీరానికి ఆహారం నుంచి అందాల్సిన పోషకాలు లభించవు. ఫలితంగా పోషకాహార లోపం వస్తుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ భోజనాన్ని నెమ్మదిగా చేయాలి. అప్పుడే తిన్నది మనకు వంటబడుతుంది. ఇదే విషయాన్ని మన పెద్దలు కూడా పదే పదే చెబుతుంటారు. కాబట్టి ఎప్పుడైనా.. ఎక్కడైనా సరే.. ఆహారాన్ని నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.