Headache : తలనొప్పి అనేది మనకు వచ్చే సాధారణ అనారోగ్య సమస్యల్లో ఒకటి. ఇది తరచూ చాలా మందికి వస్తూనే ఉంటుంది. తలనొప్పిగా ఉందంటే చాలు.. కొందరు కాఫీ, టీ లను సేవిస్తారు. కొందరు మద్యం సేవిస్తారు. ఇంకా కొందరు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అయితే కాఫీ, టీ అయితే ఫర్వాలేదు. కానీ ఆ ఇతర చిట్కాలను పాటిస్తేనే మన శరీరంపై సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం పడుతుంది. కానీ తలనొప్పి వచ్చిన వెంటనే కాకుండా కాసేపు ఆగి చూసి తగ్గకపోతే అప్పుడు సహజసిద్ధంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక తలనొప్పిని తగ్గించుకునేందుకు మనకు పలు సహజసిద్ధమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే..
ఆయుర్వేదంలో గరికకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఇది అనేక అనారోగ్య సమస్యలను తగ్గించగలదు. దీన్ని వినాయకుడి పూజలోనూ ఉపయోగిస్తారు. గరికలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని ఉపయోగించి అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. వాటిల్లో తలనొప్పి కూడా ఒకటి. తలనొప్పి బాగా ఉంటే ఒక టీస్పూన్ గరిక గడ్డి రసంలో అర టీస్పూన్ అతిమధురం చూర్ణం కలిపి రోజుకు 2 పూటలా ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేస్తే తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
ఇక గరికతోపాటు ఎండుద్రాక్ష, బాదంపప్పును కలిపి తీసుకున్నా తలనొప్పి నుంచి బయట పడవచ్చు. ఎండు ద్రాక్ష, బాదంపప్పులను 5 చొప్పున తీసుకుని రెండింటినీ కలిపి తినాలి. తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే ధనియాలతో కషాయం చేసి ఒక కప్పు మోతాదులో తాగినా చాలు.. తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ చిట్కాలను పాటించినా తలనొప్పి తగ్గడం లేదు అంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో సరైన చికిత్స తీసుకుని తలనొప్పి నుంచి బయట పడవచ్చు.