ప్రయాణాల వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోతుంటాం. కొన్నిసార్లు శారీరక శ్రమ ఎక్కువగా చేసినా అలసిపోతాం. అయితే ఈ అలసట నుంచి బయట పడేందుకు కొన్ని సులభమైన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల అలసట నుంచి బయట పడవచ్చు. మరి ఆ మార్గాలు ఏమిటంటే..
1. ప్రయాణంలో ఎక్కువ సేపు కూర్చున్నా, శారీరక శ్రమ ఎక్కువగా చేసినా కండరాలు, కీళ్లలో నొప్పి కలుగుతుంది. దీంతోపాటు ఒళ్లు నొప్పులు వస్తాయి. అయితే వాటి నుంచి త్వరగా బయట పడాలంటే మెగ్నిషియం అధికంగా లభించే ఆహారాలను తీసుకోవాలి. నువ్వులు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదం పప్పు, జీడిపప్పులలో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకుంటే శరీరానికి మెగ్నిషియం లభిస్తుంది. తద్వారా అలసట నుంచి బయట పడవచ్చు.
2. ప్రయాణాలు చేసినవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసినవారు అలసిపోతే ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటే అలసట నుంచి బయట పడవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు అరోమా వాసనలు చూడాలి. లావెండర్, అల్లం, మిరియాల నూనెలు మనకు లభిస్తాయి. వీటిని వాసన చూస్తే ఒత్తిడి మటు మాయం అవుతుంది. దీంతో అలసట కూడా తగ్గుతుంది.
3. బకెట్ వేడి నీళ్లలో గుప్పుడె ఎప్సం సాల్ట్ కలపాలి. ఆ నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒళ్లు నొప్పులు, ఒత్తిడి తగ్గుతాయి. ప్రయాణం చేసి వచ్చిన వెంటనే లేదా శ్రమ చేసిన వెంటనే మళ్లీ ఉత్సాహం రావాలంటే ఎప్సం సాల్ట్ కలిపిన వేడి నీళ్లతో స్నానం చేయాలి. దీంతో ఒత్తిడి, అలసట రెండూ తగ్గుతాయి.
4. నొప్పులు త్వరగా తగ్గాలంటే కోల్డ్ థెరపీని ప్రయత్నించి చూడాలి. వస్త్రంలో ఐస్ క్యూబ్స్ వేసి నొప్పి ఉన్న చోట సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. సమస్య తగ్గుతుంది. అలసట కూడా తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365