అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దోమలు కేవ‌లం కొంత మందినే ఎందుకు ఎక్కువగా కుడ‌తాయ‌నే విష‌యం తెలిసిపోయింది.. వారినే అవి ఎక్కువ‌గా కుడ‌తాయ‌ట‌..!

వర్షాకాలం వచ్చింది. దోమ‌లు పెరిగిపోయాయి. గుయ్ మంటూ వ‌చ్చి అవి మ‌న శ‌రీరంపై ఏదో ఒక చోట కుడ‌తాయి. దీంతో ఆ ప్ర‌దేశంలో చ‌ర్మం ఎర్ర‌గా మారుతుంది. కొన్నిసార్లు ఉబ్బిపోయి దుర‌ద పెడుతుంది. అయితే దోమ‌లు అంద‌రినీ కుట్ట‌వు. కేవ‌లం కొంద‌రినే ఎక్కువ‌గా కుడ‌తాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల ద్వారా 2014లోనే వెల్ల‌డించారు. వారు ఏం చెబుతున్నారంటే..

why mosquitoes bite only some people experts have answers

2014 లో టైమ్ మ్యాగజైన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్న‌వారిని దోమలు ఎక్కువ‌గా కుడ‌తాయ‌ని తేలింది. అదేవిధంగా ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలోని వైద్య కీటక శాస్త్రవేత్త, దోమల నిపుణుడు డాక్టర్ జోనాథన్ డే మాట్లాడుతూ ‘O’ గ్రూప్‌ రక్తం దోమలను ఇతరులకన్నా (A లేదా B గ్రూప్ ర‌క్తం) ఎక్కువగా ఆకర్షిస్తుందని చెప్పారు.

మానవ చర్మం దోమలను ఆకర్షించే లాక్టిక్ యాసిడ్‌ సహా వివిధ రసాయనాలను స్రవిస్తుంద‌ని డాక్టర్ డే చెప్పారు. కొంత మంది చ‌ర్మం నుంచి ఇలాంటి రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి దోమలను బాగా ఆక‌ర్షిస్తాయ‌ని చెప్పారు. అందువ‌ల్ల ఆయా కెమిక‌ల్స్ ఎక్కువ‌గా రిలీజ్ అయ్యే వారిని దోమ‌లు ఎక్కువ‌గా కుడ‌తాయ‌న్నారు.

ఇక దోమ‌లు త‌మ ల‌క్ష్యాన్ని గుర్తించడానికి కార్బన్ డయాక్సైడ్ (CO2) ను గుర్తిస్తాయ‌ని అన్నారు. కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను మ‌నం శ్వాస ద్వారా బ‌య‌ట‌కు వ‌దులుతాం. అది దోమ‌ల‌ను ఆక‌ర్షిస్తుంది. అందువ‌ల్ల దోమ‌లు దానికి ఆక‌ర్షిత‌మై మ‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి కుడ‌తాయి. ఇక మెట‌బాలిజం ఎక్కువ‌గా ఉండే గ‌ర్భిణీలు, స్థూల‌కాయం ఉన్న‌వారిని కూడా దోమ‌లు ఎక్కువ‌గా కుడతాయి. ఈ క్ర‌మంలో అవి డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి అనేక వ్యాధుల‌ను వ్యాపింప జేస్తాయి.

అయితే యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. కోవిడ్ -19 దోమలు లేదా పేల‌ ద్వారా వ్యాపించ‌దని తేలింది. ఇందుకు ఆధారాలు కూడా లేవ‌ని చెప్పారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts