Brain Health : రోజూ యాక్టివ్ ఉంటూ మెద‌డు చురుగ్గా ప‌నిచేయాలంటే.. ఇలా చేయాలి..!

Brain Health : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మస్య‌లు వ‌స్తున్నాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే రోజూ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డంతోపాటు కింద తెలిపిన విధంగా ప‌లు సూచ‌న‌లు పాటించాలి. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు.

follow these tips for Brain Health
Brain Health

1. వ్యాయామం
రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల‌న మెద‌డు ఎంతో చురుకుగా ప‌ని చేస్తుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ మెరుగు ప‌డి మెద‌డును ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌నం వ్యాయామం చేసిన‌ప్పుడు మెద‌డులోని క‌ణాలు ప్రోటీన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. దీనిని న్యూరోట్రోపిక్ ఫ్యాక్ట‌ర్ అంటారు. ఈ ప్రోటీన్లు ఇత‌ర ర‌సాయ‌నాల‌తో క‌లిసి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంతోపాటు మెద‌డు నేర్చుకునే సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. నిత్యం వ్యాయామం చేయ‌డం వ‌ల‌న మెద‌డుకి ర‌క్త ప్ర‌స‌ర‌ణ చురుకుగా జ‌రుగుతుంది. నాడీ క‌ణాల జీవిత కాలం పెరుగుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు రావ‌డానికి అవ‌కాశాలు త‌గ్గుతాయి. నాడీ క‌ణాల భ‌ద్ర‌త వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది.

2. త‌గిన నిద్ర‌
మ‌న శ‌రీరానికి మాత్ర‌మే కాదు, మ‌న మెద‌డుకి కూడా త‌గిన నిద్ర అవ‌స‌రం. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌తో పాటు మెద‌డుకి సంబంధించిన వ్యాధులు మ‌న ద‌రి చేర‌వు. మెద‌డుకి త‌గినంత నిద్ర ఉండ‌డం వ‌ల‌న మ‌నం ప్ర‌తికూల ఆలోచ‌న‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో మ‌న‌లోని సృజ‌నాత్మ‌క‌త మెరుగుప‌డుతుంది. త‌గినంత నిద్రించ‌డం వ‌ల‌న జ్ఞాప‌కశ‌క్తితోపాటు ఆలోచ‌న శ‌క్తి కూడా మెరుగు ప‌డుతుంది. రోజుకి 6 లేదా 8 గంట‌లు నిద్రించ‌డం వ‌ల‌న మెద‌డు అభివృద్ధి చెందడంతోపాటు నేర్చుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది. మెద‌డుకి త‌గినంత నిద్ర ఉండ‌డం వ‌ల‌న మ‌న రోజూ వారి ప‌నుల‌ను స‌రిగ్గా చేసుకోగ‌లం. మ‌న ప్రవ‌ర్త‌న అదుపులో ఉంటుంది.

3. కొబ్బ‌రి నూనె
మెద‌డుకి శ‌క్తిని ఇచ్చే వాటిల్లో గ్లూకోజ్ ఒక‌టి. మెద‌డు స్వ‌త‌హాగా ఇన్సులిన్ ను త‌యారు చేసుకోగ‌ల‌దు. ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లోకి గ్లూకోజ్‌ని పంపించ‌డంలో ఇన్సులిన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇన్సులిన్ త‌గినంత ఉత్ప‌త్తి జ‌ర‌గ‌క‌పోతే మెద‌డు చ‌చ్చుబ‌డిపోవ‌డంతోపాటు మ‌తిమ‌రుపు కూడా వ‌స్తుంది. కొబ్బ‌రి నూనెను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌లన మెద‌డు ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. కొబ్బ‌రి నూనె నాడీ క‌ణాల‌ను ర‌క్షిస్తుంది. కొత్త నాడీ క‌ణాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది.

4. విట‌మిన్ డి
మ‌న శ‌రీరానికి విట‌మిన్ డి చాలా అవ‌స‌రం. మెద‌డులోని న‌రాల ఆరోగ్యానికి విట‌మిన్ డి ఎంతో స‌హాయ ప‌డుతుంది. మ‌న శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి ని సూర్య‌ర‌శ్మి ద్వారా లేదా విట‌మిన్ డి గ‌ల ఆహార ప‌దార్థాల ద్వారా పొంద‌వ‌చ్చు. దీంతో మెద‌డు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

5. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు
మెద‌డు, రెటీనా నిర్మాణంలో డీఎన్ఏ పాత్ర ఎంతో ఉంటుంది. మ‌న మెద‌డు నిర్మాణంలో 60 నుండి 25 శాతం డీఎన్ఏ పాత్ర ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరంలో డీఎన్ఏ శాతం పెరుగుతుంది. లివ‌ర్, చేప‌ల వంటి ఆహార ప‌దార్థాల‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఈ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న మెద‌డు ఎంతో చురుగ్గా ప‌ని చేస్తుంది.

D

Recent Posts