Bandla Ganesh : ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యాంప్ నుంచి బండ్ల గ‌ణేష్‌ను త‌న్ని త‌రిమేశారా ?

Bandla Ganesh : ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య‌కాలంలో త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఇటీవ‌ల ఆయన మాట్లాడిన‌ట్లుగా ఓ ఆడియో టేప్‌ను విడుద‌ల చేశారు. అందులో ఆయ‌న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ను దూషించారు. ఆయ‌న త‌న‌ను ప‌వ‌న్‌తో రాకుండా అడ్డుకుంటున్నార‌ని బండ్ల గ‌ణేష్ ఆరోపించారు. అయితే అప్ప‌టికే డ్యామేజ్ జ‌రిగింద‌ని తెలుసుకున్న బండ్ల గ‌ణేష్ త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Bandla Ganesh is kicked out of Pawan Kalyan Camp
Bandla Ganesh

ఆ ఆడియో టేప్ లో ఉన్న గొంతు త‌న‌ది కాద‌ని బండ్ల గ‌ణేష్ అన్నారు. త‌న గొంతును ఎవ‌రో మిమిక్రీ చేశార‌ని.. ఎవ‌రో కావాల‌నే త‌నను ఇరికించేందుకు ఇలా చేస్తున్నార‌ని అన్నారు. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. బండ్ల గ‌ణేష్ ను ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యాంపు నుంచి త‌న్ని త‌రిమేశార‌ని తెలుస్తోంది. అస‌లు బండ్ల గ‌ణేష్ గ‌ణేష్ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని అంటున్నార‌ట‌. అంత‌లా ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ట‌. అందుక‌నే బండ్ల గ‌ణేష్ వార్త‌ల్లో నిలిచినా ఎవ‌రూ ఆయ‌న‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని అంటున్నారు.

ఇక గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ప్ప‌టికీ తాజాగా బండ్ల గ‌ణేష్.. త్రివిక్ర‌మ్ పై చేసిన వ్యాఖ్య‌లే ఆయ‌న‌కు ముప్పును తెచ్చి పెట్టాయ‌ట‌. అందుక‌నే బండ్ల గ‌ణేష్‌ను దూరంగా ఉంచుతున్నార‌ట‌. క‌నుక‌నే బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య ప‌వ‌న్ క్యాంపులో క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే ప‌వ‌న్ నేరుగా ఈ విష‌యంపై స్పందించ‌లేదు కానీ.. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యంపైనే బండ్ల గ‌ణేష్ భ‌విష్య‌త్తు ఆధార ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ విషయంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Editor

Recent Posts