Bigg Boss : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ షోకు నాగార్జున మళ్లీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో గత సీజన్‌లకు భిన్నంగా కేవలం ఓటీటీలోనే ప్రసారం కానుంది. రోజుకు 24 గంటలూ ఈ షోను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. అయితే ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనేది ఇంకా నిర్దారణ కాలేదు. కానీ కొందరు పాత వాళ్లను కూడా ఈ షోకు కంటెస్టెంట్లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గత సీజన్‌లో పాల్గొన్న సింగర్ గీతా మాధురిని ఈషోకు ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక ఈ ఆఫర్‌కు ఆమె ఒప్పుకోలేదని సమాచారం.
అయితే గీతా మాధురికి వాస్తవానికి ఈ షోలో పాల్గొనాలని ఉందట. కానీ ఆమె పలు కారణాల వల్ల ఈ షోలో పాల్గొనలేనని చెప్పేసింది. ఆమె బిగ్ బాస్ సీజన్ 2 లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ కోసం ఆమెకు కాల్ చేశారట. కానీ ఆ ఆఫర్‌ను ఆమె తిరస్కరించిందట. తన ఫ్యామిలీని చూసుకోవాలనే కారణంతో ఆమె ఈషోకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఇక ఈ సందర్భంగా గీతా మాధురి పలు విషయాలను తెలియజేసింది. సీజన్ 2లో తాను సెకండ్ హ్యాండ్ అయిపోయానని.. ఇప్పుడు మళ్లీ ఇంకోసారి వెళ్తే థర్డ్ హ్యాండ్ అయిపోతానని అన్నది. అందువల్లే ఈసారి షోలో ఆఫర్ వచ్చినా పాల్గొనడం లేదని తెలియజేసింది.
ఇక షోలో పాల్గొనేవారికి ఆమె కొన్ని సూచనలు కూడా చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ షోలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. చాలా యాక్టివ్‌గా ఉండాలని తెలియజేసింది. అలా ఉంటే షోలో విజేతలు అయ్యే అవకాశాలు ఉంటాయని తెలియజేసింది.