హెల్త్ టిప్స్

బైపాస్ స‌ర్జ‌రీ చేయించుకున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే..!

కొందరిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చిన తర్వాత వారికి బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకసారి చేసిన తర్వాత మరోసారి కూడా చేయాల్సిరావచ్చు. కాబట్టి బైపాస్ సర్జరీ చేసుకున్న రోగులు ఆ తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరం రక్తపోటును, కొవ్వును, బరువు పెరగడాన్ని మీకుగా మీరు నియంత్రించుకుంటుండాలి. బైపాస్ సర్జరీ ద్వారా గుండెలో పేరుకుపోయిన కొవ్వును తొలగించలేరు, కేవలం గుండెకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా వైద్యులు చేస్తారు. సర్జరీ తర్వాత మందులు తీసుకోవడం వలన బ్లాకింగ్ ప్రక్రియ క్రమంగా తొలగిపోతుంది. కాని ఆగదు.

బైపాస్ సర్జరీ నిశ్చిత సమయం వరకే ఉపయోపడుతుంది. ఎవరైనా సర్జరీ తర్వాత జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్యులు. బైపాస్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. శరీర బరువు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించేందుకు ప్రయత్నించండి. పొగాకు, ధూమపానం, మద్యపానం సేవించే అలవాటుంటే వాటిని మానేందుకు ప్రయత్నించాలి. శరీరంలో (షుగర్) మధుమేహం ఉంటే దానిని నియంత్రించేందుకు ప్రయత్నించాలి. రక్తపోటును నియంత్రించండి.

follow these tips if you had done bypass surgery

అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోను సేవించరాదు. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోండి. మానసికపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించండి. తరచూ ఒత్తిడికి గురికాకూడదు. ప్రతి రోజు కనీసం నాలుగు కిలోమీటర్ల మేరకు నడక సాగించాలి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే బైపాస్ సర్జరీ చేసుకున్న వారు ఆరోగ్యవంతులుగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Admin

Recent Posts