అసలు స్త్రీ పురుషుల మధ్యగల సంబంధం వాస్తవమని ఎపుడు అనాలి? అసలు ఏదో నిజమైన అనుబంధం అనుకుని అంతా నటనలో కొనసాగుతూంటాం. చాలావరకు మహిళ లేదా పురుషుడు వేరే దారి లేక తన సంబంధాలను కొనసాగిస్తూంటారు. కొంతమందికి ఇంటర్నెట్ ప్రేమాయణం. నిరూపించిన ప్రేమకు ఖండాల అవతల వున్నా బంధం బంధమే. అయితే, ఆ సంబంధం పరీక్షలకు గురయితేనే అది వాస్తవ సంబంధంగా గుర్తించాలి. వాస్తవ సంబంధాలలో ప్రధానం అయినవి.
స్త్రీ పురుషులు ఒకరికొకరు కట్టుబడి వుండటం. కాని నేటి యువత ఫేస్ బుక్ వరకే పరిమితమవుతోంది. అది వారిలో సహజంగా ఏర్పడాలి. ఎటువంటి బలవంతం వుండరాదు. కలసి ఒకే గది లో వుండటం. జంటలు దూరంగా వున్నా ప్రేమే. దగ్గరగా వున్నా ప్రేమే. అనటానికి వీలు లేదు. ఒకే గదిలో కొంతకాలం వుంటే వారి మధ్య తగవులు రాకుంటే, వచ్చినా వారు కొనసాగుతూంటే అది నిజమైన ప్రేమ. హృదయాలకు సంబంధించిన ప్రేమ. ఇటువంటివన్ని కవిత్వానికి, కధలకు పరిమితం. శారీరకంగా ఒకే చోట వుండి కష్ట సుఖాలు అనుభవించడం, ఆనందించడమే వాస్తవ సంబంధంగా గుర్తించాలి.
ఎన్నో కష్టాలలో పడ్డారా? వాటినుండి గట్టెక్కాలి. ఆ కష్టాలు, అవాంఛనీయ గర్భం కావచ్చు. బిడ్డ మరణం కావచ్చు. తల్లితండ్రులు మీ ప్రేమను వ్యతిరేకించవచ్చు. అన్నిటికి తట్టుకుని నిలబడటమే నిజమైన సంబంధం. ఈమెను లేదా ఇతనిని వదిలేయాలి అనుకుంటూ వదలలేకపోతున్నారా? ఎంతో కాలంగా కొనసాగిస్తున్నారా? తగవులు, పోట్లాటలు కూడా మిమ్మల్ని విడదీయలేకపోతున్నాయా? అయితే అది మీ నిజమైన సంబంధమే. వాస్తవమేమిటో తెలియని ఈ అవాస్తవిక ప్రపంచంలో మరి మీ భాగస్వామి ఈ పరీక్షలకు నిలబడి బాసటగా వుంటే అది నిజమైన సంబంధం గానే గుర్తించండి.