శరీరంలో నీరు సరిపడా లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మూత్రం పోసేటపుడు మంట. డల్ గా వుండే చర్మం, బలహీనపడే కండరాలు, మలబద్ధకం, మొదలైనవి బాధిస్తాయి. శరీరంలో అన్ని వ్యవస్ధలు నీరు కోరుతాయి. కనుక తగినంత నీరు అందించటం అవసరం. నీరు తాగటానికి సమయం లేదంటారా? అయితే…కొన్ని తిండిపదార్ధాలు పరిశీలించండి. వాటిని తింటూ శరీరానికవసరమైన నీటిని ఎపుడూ అందించండి.
వెజిటబుల్స్ – బ్రక్కోలి, కేరట్లు, సొరకాయ, ఉల్లి, టమాటాలు, దోస మొదలైన వాటిల్లో నీరు అధికం. వీటిని మీ ఆహారంలో భాగంగా చేర్చండి. పండ్ల రసాలు – పండ్లలో వుండే సహజ నీరు శరీరానికి మంచిది. పుచ్చకాయ, పైన్ ఆపిల్, ఆపిల్, స్ట్రాబెర్రీలు, స్క్వాష్, నిమ్మరనం, ఆరెంజెస్, చెర్రీస్ వంటి పండ్లు శరీరానికి పుష్కలంగా ద్రవాలను అందిస్తాయి. వర్కవుట్ల తర్వాత శరీరానికి డీహైడ్రేషన్ ఏర్పడకూడదంటే, వెంటనే తగినంత పండ్లరసాలు లేదా నీరు తాగాలి.
ద్రవ పదార్ధాలు – ఆహారంలో సూప్, పండ్లు, వెజిటబుల్ సూప్ వంటివి తీసుకుంటే నీరు బేలన్స్ అవుతుంది. నీరు – ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసులు కనీసం నీటిని తాగాలి. అది శరీరంలో కావలసినంత తేమను వుంచుతుంది. మలినాలను విసర్జిస్తుంది. ముఖాన్ని కాంతివంతం చేయడం, జుట్టు రాలకుండా చేయటం చేస్తుంది. ప్రతి గంటకు లేదా అరగంటకు ఒక గ్లాసు నీరు తాగండి. పాల ఉత్పత్తులు – పాలు, పెరుగు వంటివి ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. వీటిలో శరీరానికి తగిన కాల్షియం, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు వుంటాయి. మిల్క్ షేక్, బటర్ మిల్క్ వంటివి రుచిగా కూడా వుంటాయి.