హెల్త్ టిప్స్

యవ్వనంగా ఉండాలనుకునేవారికోసం..

వాతావరణ కాలుష్యం మనిషిని పట్టి పీడిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అందంగా, యవ్వనంగా కనిపించడానికి మహిళలు రసాయనాలు కలిపిన క్రీములు, మందులు వాడడం ప్రమాదానికి దారితీస్తుంది. దీంతో వెంట్రుకలు రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ యవ్వనంగా కనిపించాలనుకునేవారికి.. తక్కువ ఖర్చుతో వనమూలికలు ఎక్కువ ఫలితాలనిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అశ్వగంధ, రియోడియోలా రోసియా, గిన్సెంగ్ వంటి మొక్కలు ఏవైనా వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. అశ్వగంధ అనే మొక్క ప్రకృతి ప్రసాదించిన వైద్య మొక్క అని చెప్పవచ్చు.

అశ్వగంధ :

వయసు మీద పడిన వారంతా యవ్వనంగా కనబడడానికి నానాతంటాలు పడుతుంటారు. యూత్ వేసుకునే దుస్తులు ధరిస్తూ కొంతమేరకు వయసును తగ్గించుకుంటారు. ఇలా ఎన్ని రోజులు. వయసును కప్పి పెట్టడానికి అవస్థలు పడేవారికి వరప్రసాదినిగా అశ్వగంధ మొక్క అని చెప్పవచ్చు. ఈ మొక్కకు మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి. ఇది మనిషిలోని ఆందోళన, ఒత్తిడి, ఆత్రుత, మానసిక వైరాగ్యాలను తగ్గిస్తుంది.

follow these wonderful health tips to be young

రోహాలియా రోసియా (గులాబీ) :

ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మనిషిని మరింత ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇందులోని ఔషధ గుణాలు దివ్యంగా ఉంటాయి. ఒత్తిడి నుంచి వెసులుబాటు కలిగిస్తూ శరీరంలోని కణాలను కొత్త శక్తినిస్తాయి. రోహాలియా రోసియా మొక్క వ్యాధినిరోధకతను పెంచడంతోపాటు మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గిన్సెంగ్ :
ఇది మంచి ఔషధ మూలిక. దీనిలో కూడా యవ్వనాన్ని పెంపొందించే లక్షణాలున్నాయి. ఈ మూలిక తీసుకున్న వారిలో ఉద్వేగం పెరుగడంతోపాటు శారీరక దృఢత్వం పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గడం, రక్త ప్రసరణను పెంచడం, శరీరంలో కొలస్ట్రాల్‌ను నియంత్రించడానికి దోహదపడుతుంది.

Admin