హెల్త్ టిప్స్

కొబ్బ‌రిపాల‌తో అందం.. ఆరోగ్యం..

కొబ్బరి పాలు ఆవుపాల కన్నా ఆరోగ్యకరమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరిపాల వల్ల చాల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. కొబ్బరి పాలల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన కొబ్బ‌రి పాలు ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌కరం. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, కొబ్బరి పాలు… ఇలా కొబ్బరి కాయలో ప్రతీదీ మనకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బ‌రి పాలు జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి బాగా సహకరిస్తుంది. ఎలాంటి ఆహారమైనా త్వరగా జీర్ణమవడానికి ఇవి తోడ్పడతాయి.

కొంతమంది పాల ఉత్పత్తులంటే ఇష్టపడరు. కనీసం పెరుగు కూడా తినరు. అలాంటి వాళ్లు కొబ్బరిపాలు తీసుకోవడం చాలా ఉత్త‌మం. కొబ్బరిపాలు కీళ్ల నొప్పులు తగ్గించడానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి. తీవ్ర ఒత్తిడి, ఆందోళనతో బాధపడే వాళ్లకు కొబ్బరిపాలు చక్కటి పరిష్కారం. వీటిలో ఉండే పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. కొబ్బరిపాలలో పోషకాలు మెండు. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు చెక్‌పెడతాయి.

you can get both health and beauty with coconut milk

కొబ్బరి పాలు జుట్టు కుదుళ్లు దృఢంగా చేస్తాయి. వీటిని జుట్టుకు పట్టించి అనంతరం తలస్నానం చేస్తే జుట్టుకు మాయిశ్చరైజర్ లభించి మృదువుగా అవుతుంది. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు కొబ్బరి పాలలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. రోజుకో కప్పు కొబ్బరిపాలు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కొబ్బరిపాలలో ఉండే ఖనిజాలు క్యాన్సర్‌ని అరికడతాయి.

ప్రేగు క్యాన్సర్‌, కాలేయ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ నివారించడానికి సహాయపడుతుంది. క్యాన్సర్‌ సెల్స్‌ అభివృద్ధిని నిరోధించగల అందుకే తరచుగా కొబ్బరిపాలను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. చర్మంపై పేరుకొనే మృతకణాలు తొలగించేందుకూ కొబ్బరిపాలను ఉపయోగించొచ్చు. కొబ్బరిపాలల్లో విటమిన్‌ సి కూడా ఉంటుంది. ఇది చర్మంలో సాగే గుణాన్ని పెంచుతుంది. ఇందులోని రాగి ముడతల్ని నివారిస్తుంది. వయసురీత్యా వచ్చే మచ్చల్ని తగ్గిస్తుంది.

Admin

Recent Posts