Garlic For Bones Health : వీటిని రోజుకు 4 తింటే చాలు.. అంతులేని బ‌లం.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Garlic For Bones Health : మ‌న శ‌రీరాన్ని ఎముక‌ల గూడుగా అభివ‌ర్ణిస్తూ ఉంటారు. శ‌రీర నిర్మాణంలో ఎముక‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎముక‌లు ధృడంగా ఉంటేనే మ‌న శ‌రీరం కూడా ధృడంగా ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఎముక‌లు గుల్ల బార‌డం, ఎముక‌లు విర‌గ‌డం, ఎముక‌లు అరిగిపోవ‌డం, ఎముక‌లు బ‌ల‌హీన ప‌డ‌డం, నొప్పులు రావ‌డం, ఎముక‌లు దెబ్బ‌తిన‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎముక‌ల‌కు సంబంధించిన ఇటువంటి స‌మ‌స్య‌ల‌న్నీ త‌లెత్త‌డానికి ప్రధాన కార‌ణం మ‌న ఆహార‌పు అల‌వాట్లు. ఎసిడిక్ నేచ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఆమ్ల‌త్వం ఎక్కువ‌గా పెరుగుతుంది. ఈ ఆమ్ల‌త్వాన్ని త‌గ్గించి ర‌క్తంలో క్షార‌త్వం పెరిగేలా చేయ‌డం కోసం ఎముక‌ల్లో ఉండే క్యాల్షియం ర‌క్తంలో క‌లుస్తుంది. దీంతో ఎముక‌లు గుల్ల‌బారిపోతాయి.

అలాగే క్యాల్షియం శ‌రీరానికి త‌గినంత అంద‌క‌పోవ‌డం, శ‌రీరానికి ఎండ త‌గ‌ల‌క‌పోవ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ ర‌కాల కార‌ణాల చేత ఎముక‌లకు సంబంధించిన‌ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుందని నిపుణులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. వెల్లుల్లిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతున్నాయని వారు నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే అలిసిన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఎముక నిర్మాణాన్ని తిరిగి సాధార‌ణ స్థితికి తీసుకురావ‌డంలో అలాగే క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ ఎముక‌ల క‌ణాల్లోకి బాగా వెళ్లేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే ఎముక క‌ణజాలానికి ప్రోటీన్ బాగా ప‌ట్టేలా చేయ‌డంలో ఎముక‌లో దెబ్బ‌తిన్న క‌ణాల‌ను బాగు చేసి తిరిగి సాధార‌ణ స్థితికి తీసుకురావ‌డంలో వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం వంటల్లో నిత్యం వెల్లుల్లిని ఉప‌యోగిస్తూ ఉంటాం.

Garlic For Bones Health take daily for effective results
Garlic For Bones Health

కానీ వేడి నూనెలో వేయ‌డం వ‌ల్ల దీనిలో ఉండే మూల‌కాలు దెబ్బ‌తింటాయి. క‌నుక వీటిని ప‌చ్చిగా తీసుకోవ‌డం లేదా త‌క్కువ వేడి ఉన్న నూనెలో వేసి తీసుకోవ‌డం మంచిది. కొంద‌రిలో క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకున్న‌ప్ప‌టికి ఎముక‌లు ధృడంగా ఉండ‌వు. అలాంటి వారు అలాగే ఎముక‌ల‌ను సంబంధిత వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వెల్లుల్లిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts