హెల్త్ టిప్స్

Ginger Juice : రోజూ ప‌ర‌గ‌డుపునే అల్లం ర‌సం సేవిస్తే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Ginger Juice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని త‌ర‌చూ వంట‌ల్లో పేస్ట్‌లా చేసి వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప‌రంగా అల్లం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ అల్లం ర‌సం సేవిస్తే మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇక అల్లం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం ర‌సాన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ మోతాదులో సేవించ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి. ముఖ్యంగా గ్యాస్, క‌డుపులో మంట‌, అజీర్ణం, వికారం, వాంతులు నుంచి విముక్తి ల‌భిస్తుంది. అలాగే దంతాలు, చిగుళ్ల నొప్పులు త‌గ్గుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అల్లంలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు మ‌న‌ల్ని వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ginger juice on empty stomach many wonderful health benefits

చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు అల్లం జ్యూస్ ని తీసుకుంటే ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో మీ క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావడానికి అల్లం తోడ్పడుతుంది.కండరాల నొప్పులకు కూడా అల్లం మంచి మందులా పని చేస్తుంది. వ్యాయాయం వల్ల కలిగే కండరాల నొప్పులను అల్లం తగ్గిస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు అల్లం కీళ్ళ నొప్పులను, ఆర్థరైటిస్ నొప్పులను కూడా తగ్గిస్తుంది.

అంతేకాకుండా బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్న వాళ్ళు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది. అలాగే మధుమేహం రోగుల ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు అల్లం ఉపయోగపడుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అల్లాన్ని డైట్ లో తీసుకోవాలనుకుంటే వైద్యుల సూచనలను తీసుకోవడం మంచిది.

Admin

Recent Posts