Crystal Turtle : వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది ఇళ్లలో అనేక రకాల వస్తువులను పెట్టుకుంటుంటారు. పలు రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీంతోపాటు ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లోని వారికి ఉండే సమస్యలు తగ్గుతాయి. అయితే వాస్తు దోషాలు పోవాలంటే ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువుల్లో క్రిస్టల్ తాబేలు కూడా ఒకటి. క్రిస్టల్ తాబేలు మన ఇంట్లోకి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో దీన్ని కొన్ని చోట్ల ఉంచితే మనకు అంతా మంచే జరుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక క్రిస్టల్ తాబేలును ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం క్రిస్టల్స్ మనకు దీర్ఘాయువును అందిస్తాయి. ఆర్థిక స్థిరత్వాన్ని చేకూరుస్తాయి. నిలకడగా ఉండేలా చేస్తాయి. మనకు రక్షణను అందిస్తాయి. అలాగే క్రిస్టల్స్ వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో సరైన దిశలో క్రిస్టల్ తాబేలును పెట్టడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇల్లు వృద్ధి చెందుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.
వాస్తు ప్రకారం ఉత్తర దిక్కును సంపద అందించే దిక్కుగా చెబుతారు. అందువల్ల ఉత్తర దిక్కులు మీరు క్రిస్టల్ తాబేలును పెట్టినట్లయితే ఆర్థిక సమస్యలు పోతాయి. అంతా మంచే జరుగుతుంది. క్రిస్టల్ తాబేలు ఉత్తర దిశను చూస్తూ ఉండేలా పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు గనక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అప్పుడు క్రిస్టల్ తాబేలును ఇంట్లో ఉత్తర దిశలో పెట్టాలి. దీంతో ఇంట్లోని వారికి ఉండే ఆరోగ్య సమస్యలు పోతాయి. అలాగే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది.
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య లేదా దంపతుల మధ్య కలహాలు, బంధువులతో కలహాలు ఉన్నవారు క్రిస్టల్ తాబేలును ఇంట్లో నైరుతి దిశలో పెట్టాలి. దీంతో వారి మధ్య బంధాలు బలపడతాయి. అయితే ఆగ్నేయం, ఈశాన్యం దిక్కుల్లో మాత్రం ఈ క్రిస్టల్ తాబేలును పెట్టకూడదు. దీన్ని ఉంచిన చోటును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అయితే క్రిస్టల్ తాబేలుపై సూర్యకాంతి నేరుగా పడితే దాని ప్రభావం తగ్గిపోతుంది. కనుక దానిపై సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టుకునే వాటర్ ఫౌంటెయిన్ పక్కనే గనక ఈ క్రిస్టల్ తాబేలును పెడితే ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీంతో మరింత ఎక్కువ ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందని, సమస్యల నుంచి బయట పడతారని చెబుతున్నారు. కనుక ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే ఎవరైనా సరే ప్రయోజనాన్ని పొందవచ్చు.