Gond Katira : విరిగిన ఎముక‌ల్ని త్వ‌ర‌గా అతికిస్తుంది.. న‌డుము నొప్పి ఉండ‌దు.. దీని గురించి తెలుసా..?

Gond Katira : గోంధ్ క‌టిరా.. ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన ప‌దార్థాల్లో ఇది ఒక‌టి. గోంధ్ మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో, ఆన్ లైన్ లో సుల‌భంగా ల‌భిస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గోంధ క‌టిరా వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోంధ‌క‌టిరాలో కార్బోహైడ్రేట్స్ తో పాటు క్యాల్షియం, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి. దీనిని వేయించి పొడిగా చేసి పాల‌ల్లో క‌లిపి తీసుకోవ‌చ్చు. అలాగే దీనిని వివిధ ర‌కాల ల‌డ్డూల‌లో కూడా వేసి తీసుకోవ‌చ్చు. ఒక టీ స్పూన్ నెయ్యిలో రెండు టీ స్పూన్ల క‌టిరా వేసి వేయించాలి. క‌టిరా చ‌క్క‌గా వేగి పొంగిన త‌రువాత దీనిని పొడిగా చేయాలి. ఈ పొడిని ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో వేసి క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

గోంధ్ క‌టిరాను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా, ఆరోగ్యంగా త‌యాయ‌వుతాయి. కీళ్ల మ‌ధ్య గుజ్జును పెంచే గుణం కూడా ఈ క‌టిరాకు ఉంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌డంలో క‌టిరా మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. క‌టిరాను తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, ఫ్లూ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. బాలింత‌లు ఈ గోంధ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను తొల‌గించి శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటును పెంచ‌డంలో కూడా గోంధ్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి కూడా మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానికే కాదు మ‌న అందానికి కూడా గోంధ్ ఎంతో మేలు చేస్తుంది.

Gond Katira in telugu how to use this and benefits
Gond Katira

దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. జుట్టు బ‌లంగా త‌యార‌వుతుంది. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. గుండెపోటు రాకుండా ఆరిక‌ట్ట‌డంలో కూడా గోంధ్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. శ‌రీరానికి శ‌క్తిని ఇవ్వ‌డంలో, శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో గోంధ్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ విధంగా గోంధ్ క‌టిరా మ‌ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts