రోజూ ఉదయాన్నే పరగడుపునే కొందరు టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే వాటికి బదులుగా నిమ్మకాయ నీళ్లను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవి బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. నిమ్మకాయ నీళ్లను రోజూ పరగడుపునే తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
2. నిమ్మకాయ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
3. నిమ్మకాయ నీళ్లు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల మలబద్దకం, గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
4. నిమ్మకాయ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. రోజంతా బయట తిరిగే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
5. నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడవు.
6. నిమ్మకాయ నీళ్లను తాగడం వల్ల నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. లివర్ లోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365