ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది రక రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. కొందరు సాంప్రదాయ వంటలైన ఇడ్లీ, దోశ, పూరీ వంటివి తింటారు. ఇక కొందరు పాలు, పండ్లను తీసుకుంటారు. కొందరు అన్నమే తిని పనికి బయల్దేరతారు. అయితే ఉదయం ఏది పడిదే అది తినకూడదు. కొన్ని పదార్థాలను ఉదయం అస్సలు తినకూడదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయాన్నే పెరుగు, పాలు వంటి పదార్థాలను పరగడుపునే తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది ఆయా పదార్థాల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ బాక్టీరియాను చంపుతుంది. దీంతో అసిడిటీ వస్తుంది. కనుక ఉదయం పరగడుపునే పాలు, పాల ఉత్పత్తులను తీసుకోరాదు.
2. అరటి పండ్లను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. వీటిని తినడం వల్ల ఆకలి తీరుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అయితే అరటి పండ్లలో మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని పరగడుపునే తింటే శరీరంలోని మెగ్నిషియం, పొటాషియం లెవల్స్ పై ప్రభావం పడుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక పరగడుపున అరటి పండ్లను కూడా తినరాదు.
3. టమాటాల్లో విటమిన్ సి, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే వీటిని పరగడుపున తినరాదు. వీటిలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణాశయంలో అసిడిటీని పెంచుతుంది. దీంతో గ్యాస్ సమస్యలు వస్తాయి. కనుక పరగడుపున వీటిని కూడా తినరాదు.
4. నిమ్మజాతికి చెందిన ఏ పండ్లను అయినా సరే పరగడుపున తినరాదు. తింటే గుండెల్లో మంట, అసిడిటీ వస్తాయి. కనుక వాటిని పరగడుపున తీసుకోరాదు.
5. కీరదోసలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. అందువల్ల వీటిని పరగడుపున తింటే గ్యాస్, కడుపునొప్పి, గుండెల్లో మంట వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని కూడా పరగడుపున తీసుకోరాదు.
6. టీ, కాఫీలను పరగడుపున తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని కూడా పరగడుపున తీసుకోరాదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365