ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని ప‌సుపును మోతాదుకు మించి తీసుకుంటున్నారా ? అయితే ఈ దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి జాగ్ర‌త్త‌..!

పసుపు పాలు ప్ర‌స్తుత త‌రుణంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. అవి అత్యంత శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పసుపు అనేది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది అల‌ర్జీ లక్షణాలను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కానీ పసుపు వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయి.

ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని ప‌సుపును మోతాదుకు మించి తీసుకుంటున్నారా ? అయితే ఈ దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి జాగ్ర‌త్త‌..!

పసుపులో కర్కుమిన్‌తో సహా అనేక క్రియాశీల పదార్థాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కర్కుమిన్‌ను పసుపు నుండి వేరు చేసి సప్లిమెంట్‌గా విక్రయిస్తున్నారు. అయితే పరిశోధనల‌ ద్వారా తేలిందేమిటంటే.. కొంతమందికి విరేచనాలు, ఉబ్బరం లేదా ఇతర జీర్ణ సమస్యలు వ‌స్తున్నాయ‌ని గుర్తించారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా అరుదు. కానీ రెగ్యులర్ గా ఎక్కువ పసుపును తీసుకోవడం ద్వారా కూడా అవి సంభవిస్తాయ‌ని చెబుతున్నారు.

కర్కుమిన్ ఒక శక్తివంతమైన ఆక్సిడెంట్. అందుకే చాలా మంది దీనిని సప్లిమెంట్‌ల రూపంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. కర్కుమిన్ మనకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ కొన్ని అధ్యయనాలు చెబుతున్న ప్ర‌కారం.. అది కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంద‌ని వెల్లడైంది.

కర్కుమిన్ తలనొప్పి లేదా వికారం కలిగించవచ్చని పరిశోధనలో తేలింది. ఇది అరుదైన దుష్ప్రభావం, కొద్దిమంది మాత్రమే దీనిని అనుభవించారు. మీరు అవసరమైన దానికంటే ఎక్కువగా పసుపును ఉపయోగిస్తుంటే తలనొప్పి లేదా వికారం వ‌స్తుంటే మీరు దాన్ని తీసుకోవడం తగ్గించాలి.

పసుపు ప్రకాశవంతంగా, పసుపు రంగులో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సహజ రంగును ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది. పసుపుతో వంట చేసినప్పుడు మీ చేతులు, గోళ్లకు పసుపు రంగు వ‌స్తుంది. అయితే అది తాత్కాలికమైనది. కొంత సేప‌టికి చ‌ర్మం నుంచి ప‌సుపు పోతుంది. కానీ ఎక్కువైతే పిత్తాశయంపై ప్రభావం చూపిస్తుంది. అది శ‌రీరం లోప‌లికి వెళ్తే ప్ర‌మాదం.

Admin

Recent Posts