Health Tips : వేస‌వి వేడికి త‌ట్టుకోలేక‌పోతున్నారా ? శ‌రీరం చ‌ల్ల‌గా ఉండాలంటే రోజూ వీటిని తీసుకోండి..!

Health Tips : ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు.. స‌హ‌జంగానే అంద‌రికీ వేస‌వి తాపం వ‌స్తుంది. శ‌రీరం అంతా వేడిగా మారుతుంది. దీంతో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు మ‌నం అనేక ప్ర‌యత్నాలు చేస్తుంటాం. అందులో భాగంగానే చ‌ల్ల‌ని నీళ్ల‌ను లేదా కూల్ డ్రింక్స్ తాగ‌డం.. చెరుకు ర‌సం సేవించ‌డం.. వంటివి చేస్తుంటాము. అయితే వీటితోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల కూడా శ‌రీరానికి చ‌లువ క‌లుగుతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. దీంతో వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఎండ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది. మ‌రి మనం తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..

Health Tips take these foods in this season to beat sun heat
Health Tips

1. శ‌రీరంలో వేడిని త‌గ్గించి శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచేందుకు దానిమ్మ పండ్ల ర‌సం ఎంత‌గానో ప‌నిచేస్తుంది. దీన్ని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌కు, మ‌ధ్యాహ్నం భోజ‌నానికి మ‌ధ్య తాగ‌వ‌చ్చు. లేదా మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక 1 గంట విరామం ఇచ్చి తాగ‌వ‌చ్చు. దీంతో శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వేస‌వి తాపాన్ని అడ్డుకోవ‌చ్చు.

2. వేస‌వి తాపం, శ‌రీర వేడిని త‌గ్గించ‌డంలో కొబ్బ‌రినీళ్లు కూడా బాగానే ప‌నిచేస్తాయి. వీటిని ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. మ‌ధ్యాహ్నం లేదా సాయంత్రం ఇంకో గ్లాస్ తాగాలి. దీంతో వేడి మొత్తం త‌గ్గి శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. వేస‌విలో చ‌ల్ల‌గా ఉండ‌వ‌చ్చు.

3. ఒక గ్లాస్ చ‌ల్ల‌ని పాల‌లో కొద్దిగా తేనె క‌లిపి తాగినా కూడా శరీరం చ‌ల్ల‌గా ఉంటుంది.

4. పుచ్చ‌కాయ‌లు, త‌ర్బూజాలు మ‌న‌కు ఈ సీజ‌న్‌లో బాగా ల‌భిస్తాయి. వీటిని రోజుకు ఒక క‌ప్పు మోతాదులో తింటే చాలు. శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గిపోతుంది. అయితే త‌ర్బూజాలు రుచికి చ‌ప్ప‌గా ఉంటాయి క‌నుక వాటితో జ్యూస్ త‌యారు చేసుకుని అందులో తేనె క‌లిపి తాగాలి. దీని వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది.

Admin

Recent Posts