Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టినా.. జాన్వీ కపూర్ మాత్రం నటనలో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఈమె నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అయినా నటిగా మాత్రం ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇప్పటికీ ఈమె మంచి హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే బడా ప్రొడ్యూసర్ కుమార్త కావడంతో జాన్వీకి అవకాశాలకు కొదువలేదు. కానీ ఒక్క హిట్ అయినా లభిస్తే బాగుంటుందని ఈమె ఆశిస్తోంది. అందులో భాగంగానే ఈమె పలు వరుస చిత్రాల్లో నటిస్తోంది.
ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువగా వెకేషన్స్‌కు వెళ్లే ఈమె అక్కడ దిగే ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ గ్లామర్ షో తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈమె దిగిన ఫొటోలు హీట్‌ను పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు హిందీ చిత్రాలలో నటిస్తుండగా.. ఈమె త్వరలో ఓ తెలుగు సినిమాలోనూ నటించనుంది. ఈమె తెలుగు తెరకు పరిచయం అవుతుందని ఈమె తండ్రి బోనీ కపూర్ ఇటీవలే ప్రకటించారు. ఎన్టీఆర్‌తో కలిసి ఈమె త్వరలో నటిస్తుందని తెలుస్తోంది.