హెల్త్ టిప్స్

Hing : వంట‌ల్లో వేసే ఇంగువ‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Hing : ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్ట‌మే. అంతెందుకు.. ఇంగువ వేస్తే ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వ‌స్తుందో చాలా మందికి తెలియ‌దు. ఇది ఓ మొక్క నుంచి వ‌స్తుంది. ఫెరూలా అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన వృక్ష‌జాతికి చెందిన పాల‌ను ఉప‌యోగించి ఇంగువ‌ను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో ఇంగువ వ‌ల్ల మ‌న‌కు రుచి మాత్ర‌మే కాదు, దాంతో ఇంకా అనేక ఇత‌ర లాభాలు కూడా మ‌న‌కు క‌లుగుతాయి. ఇంగువ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ స‌మ‌స్య ఉండ‌దు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్ణ స‌మ‌స్య బాధించ‌దు. మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ ఉండ‌దు. ఇతర జీర్ణ స‌మ‌స్య‌లున్నా పోతాయి. ప‌లు ర‌కాల అల్స‌ర్ల‌ను న‌యం చేసే శ‌క్తి ఇంగువ‌కు ఉంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు తేల్చి చెప్పాయి. అంతేకాదు, ఆక‌లి లేకున్నా దీంతో చేసిన ప‌దార్థాల‌ను తింటే బాగా ఆక‌లి పెరుగుతుంది. యునానీ వైద్యంలో ఇంగువ‌ను ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా కూడా వాడుతున్నారు. ఫిట్స్, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు ఇంగువ చ‌క్క‌ని ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

hing benefits do not forget to take it

మ‌హిళ‌ల్లో రుతు క్ర‌మంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు స‌హజం. అయితే వాటితోపాటు రుతు క్ర‌మం స‌రిగ్గా లేని మ‌హిళ‌లు కూడా ఇంగువ‌తో చేసిన ఆహారం తింటే దాంతో వారిలో రుతుక్ర‌మం మెరుగ‌వుతుంది. ఇది సంతాన సాఫ‌ల్య‌త అవ‌కాశాల‌ను పెంచుతుంది. ఆస్త‌మా, బ్రాంకైటిస్, ద‌గ్గు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. తీవ్ర‌మైన ప‌డిశెం (ఇన్‌ఫ్లుయెంజా) వ‌చ్చినా ఇంగువ‌తో చేసిన ఆహారం తింటే వెంట‌నే ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇంగువ వేసిన ఆహారం తింటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇది డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇన్సులిన్ లాగా ప‌నిచేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ అదుపులో ఉంటుంది.

ర‌క్త నాళాల్లో కొవ్వు గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చూస్తుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి గుండె స‌మ‌స్య‌లు రావు. త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. ఆయా నొప్పులను త‌గ్గించే గుణం ఇంగువ‌కు ఉంది. ఇంగువ‌ను వంట‌ల్లోనే కాక డైరెక్ట్‌గా కూడా తీసుకోవ‌చ్చు. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే దాన్ని గోరు వెచ్చ‌ని నీటితోనో లేదా మ‌జ్జిగ‌తోనో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts