Honey And Lemon Water : అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాల్లో ఉదయాన్నే పరగడుపున లెమన్ వాటర్ తాగడం కూడా ఒకటి. మనలో చాలా మంది బరువు తగ్గడానికి రోజూ ఉదయం పరగడుపున తేనె కలిపిన లెమన్ వాటర్ ను తాగుతూ ఉంటారు. అయితే ఇలా తేనె కలిపి లెమన్ వాటర్ ను తాగడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా.. అలాగే లెమన్ వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందా… దీని గురించి నిపుణులు ఏమంటున్నారు… అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. లెమన్ వాటర్ ను తాగడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అలాగే మనం సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజూ పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేనె కలిపిన లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆకలి తగ్గుతుంది. దీంతో క్రమంగా మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. దీని వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో శుభ్రపడుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. అలాగే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. నీరసం, బలహీనత వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. అదే విధంగా ఈ నీటిని తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయం శుభ్రపడుతుంది. రోజూ పరగడుపున తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా తేనె, నిమ్మరసం కలిపిన నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ వ్యాధిత బాధపడే వారు కేవలం నిమ్మరసం కలిపిన నీటిని మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.