Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అన్నంలో వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డి.. ఉసిరికాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డి నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. త‌రుచూ ఒకేర‌కం ప‌చ్చ‌డి కాకుండా ఇలా ఉసిరికాయ‌ల‌తో తొక్కు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో కమ్మ‌గా ఉండే ఈ ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డి తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉసిరికాయ‌లు – 10 నుండి 12, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, మిన‌ప‌ప్పు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 10 నుండి 12, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు – 7, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Usirikaya Thokku Pachadi recipe in telugu very tasty with rice
Usirikaya Thokku Pachadi

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – కొద్దిగా.

ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డి తయారీ విధానం..

ముందుగా ఉసిరికాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగా త‌డి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిని ముక్కలుగా క‌ట్ చేసుకుని లోప‌లి గింజ‌లను తీసి వేయాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉసిరికాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌లపాలి. ఉసిరికాయ ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే క‌ళాయిలో మ‌రో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మెంతులు, మిన‌ప‌ప్పు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు,ఉసిరికాయ ముక్కలు, నిమ్మ‌ర‌సం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. తరువాత క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు వేసి వేయించాలి.

తరువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డి వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఒక‌టి నుండి రెండు నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. ఉసిరికాయ‌లు దొరికిన‌ప్పుడు ఇలా తొక్కు ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts