హెల్త్ టిప్స్

Face Fat : ఈ వ్యాయామాలు చేస్తే చాలు.. మీ ముఖంపై ఉండే కొవ్వు క‌రుగుతుంది..!

Face Fat : సాధారణంగా ఎవరికైనా సరే.. వ్యాయామం చేస్తే అధిక బరువును తగ్గించుకోవడం చాలా సులభమే. ఈ క్రమంలో శరీరంలో ఉండే అనేక భాగాల్లోని కొవ్వు కూడా సులభంగా కరుగుతుంది. అయితే కొందరికి ముఖంపై బాగా కొవ్వు ఉంటుంది. అది ఒక పట్టాన కరగదు. మరి దాన్ని కరిగించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..? అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం కొంత సేపు బెలూన్లను ఊదితే ముఖానికి చక్కని వ్యాయామం అవుతుంది. దీంతో ముఖంపై ఉండే కొవ్వు కరిగి ముఖం అందంగా మారుతుంది. సాధారణంగా చాలా మందికి చూయింగ్ గమ్‌లను తింటూ బుడగలను ఊదే అలవాటు ఉంటుంది. అయితే నిజానికి అది మంచిదే. దాంతో ముఖానికి చక్కని వ్యాయామం జరిగి ముఖంపై ఉండే కొవ్వు కరుగుతుంది. అయితే నిత్యం ఉదయం, సాయంత్రం 2 సార్లు 20 నిమిషాల పాటు చూయింగ్ గమ్‌లను నమిలితే మంచిది. ఇక ఆ చూయింగ్ గమ్‌లు కూడా షుగర్ లెస్‌వి అయితే మన శరీరంలో అదనపు క్యాలరీలు చేరకుండా ఉంటాయి.

చేపల మాదిరిగా బుగ్గలను లోపలికి మడిచి నవ్వేందుకు యత్నించాలి. ఇలా 10 సెకన్లపాటు నిత్యం 15 సార్లు చేయాలి. దీంతో ముఖంలో ఉండే కొవ్వు కరిగి ముఖానికి చక్కని ఆకృతి వస్తుంది. కళ్లను పెద్దవిగా చేసి, నోట్లో ఉన్న నాలుకను బయట పెట్టి సాగదీయాలి. అనంతరం నాలుకతో గడ్డాన్ని తాకే యత్నం చేయాలి. అలా 10 సెకన్ల పాటు నిత్యం 20 సార్లు చేస్తే ముఖంపై ఉండే కొవ్వు కరుగుతుంది. ముఖం నాజూగ్గా కనిపిస్తుంది.

how to reduce face fat follow these tips

నేలపై వెల్లకిలా పడుకుని లేదా కుర్చీలో వాలుగా ఒరిగి పైకి సీలింగ్‌ను చూస్తూ పెదాలను ముద్దు పెట్టినట్లు ముందుకు తీసుకురావాలి. ఇలా 10 సెకన్ల పాటు నిత్యం 10 సార్లు చేస్తే ముఖానికి మంచి వ్యాయామం అయి కొవ్వు కరుగుతుంది. ఈ వ్యాయామం మెడ, గొంతుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

Admin

Recent Posts