హెల్త్ టిప్స్

అన్నం తింటే అధిక బ‌రువు పెరుగుతామ‌నుకుంటే అపోహే.. దాన్ని ఈ విధంగా తినాలి..

అన్నం తింటే అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని చాలా మందికి అపోహ ఉంది. కానీ నిజానికి ఇది కొంత వ‌రకు క‌రెక్టే అయినా పూర్తిగా నిజం కాదు. అన్నాన్ని కూర‌గాయ‌లు, ఆరోగ్య‌క‌ర‌మైన పోష‌కాలు క‌లిగే ఉండే ప‌దార్థాలతో తింటే ఏమీ కాదు. అనారోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి తింటే హానిక‌రం. అందువ‌ల్ల న్యూట్రిష‌నిస్టులు కూడా అధికంగా బ‌రువు పెరుగుతామ‌నే భ‌యంతో అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన ప‌నిలేద‌ని చెబుతున్నారు. దాన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప‌దార్థాల‌తో తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంటున్నారు.

అన్నం ప్రిబ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. అంటే.. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు బ‌లం క‌లిగిస్తుంది. జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియాను పెంచుతుంది. దీని వ‌ల్ల ఐబీఎస్‌, మ‌ల‌బద్ద‌కం, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. అయితే ఇందుకు గాను పూర్తిగా పాలిష్ చేయ‌బ‌డిన బియ్యాన్ని వాడ‌రాదు. కేవ‌లం ఒక్క‌సారి పాలిష్ చేయ‌బ‌డిన బియ్యం లేదా బ్రౌన్ రైస్‌ను వాడాలి. అవి తింటేనే ముందు చెప్పిన లాభాలు క‌లుగుతాయి.

how to take rice without gaining weight

ఇక అన్నంతోపాటు కూర‌గాయ‌లు, ప‌ప్పు దినుసుల‌ను క‌లిపి తింటే మ‌న శ‌రీరానికి విట‌మిన్ బి12, డిలు, ఇత‌ర పోష‌కాలు అందుతాయి. అలాగే డ‌యాబెటిస్, పీసీవోఎస్, థైరాయిడ్ స‌మ‌స్య‌లు కొంత వ‌ర‌కు త‌గ్గుతాయి.

నిద్ర‌లేమి, ఒత్తిడి, తీవ్ర‌మైన అల‌స‌ట ఉండేవారు బియ్యంతో చేసిన సూప్ తాగ‌డం మంచిది. అది కూడా రాత్రి భోజ‌నంతోపాటు తీసుకోవాలి. దీంతో జీర్ణాశ‌యం ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌కు బ‌లం చేకూరుతుంది. నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది. హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి. మ‌నస్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

Admin

Recent Posts