Heart Attack : చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ మధ్య అధిక వ్యాయామం వలన కూడా గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగాయి. అలాగే సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వలన కూడా గుండె ఆరోగ్యం దెబ్బ తింటోంది. అయితే గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనబడతాయి..?, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి.. అనే విషయాలని తెలుసుకుందాం.
గుండెపోటు రావడానికి ముందు ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది. ఇది అత్యంత పెద్ద లక్షణం అని చెప్పొచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఛాతిలో అసౌకర్యంగా ఉండడం, ఒత్తిడిగా అనిపించడం, బిగుతు లేదంటే నొప్పి ఉన్నట్లు ఉంటే అది గుండెపోటు లక్షణం అని గ్రహించాలి. గుండెపోటు రావడానికి ముందు మహిళల్లో వెన్నునొప్పి వస్తుంది. వెన్నునొప్పి ఉంటే కూడా గుండెపోటు లక్షణం అని గ్రహించాలి. అదేవిధంగా గుండెపోటు రావడానికి ముందు వికారంగా అనిపిస్తుంది.
ఊపిరి ఆడదు. దవడ నొప్పిని కూడా ఎదుర్కొంటారు. ఇటువంటి లక్షణాలు కనపడితే కూడా అది గుండెపోటు లక్షణం అని గ్రహించాలి. గుండె కండరాలకి రక్తప్రసరణ అయ్యే రక్తం గడ్డ కట్టడం వలన కూడా గుండెపోటు వస్తుంది. మెడ నొప్పి, కండరాల ఒత్తిడి కూడా గుండెపోటు యొక్క లక్షణాలే. ఛాతి, మెడ, దవడతోపాటు భుజాలలో అసౌకర్యంగా ఉంటుంది. ఇలా ఉంటే కూడా అది కచ్చితంగా గుండెపోటు లక్షణం అని తెలుసుకోవాలి. ఎడమ చేతిలో నొప్పి వస్తుంది. గుండెపోటు లక్షణాలని తెలుసుకొని సరైన వైద్యుడి సలహా తీసుకోవడం, జాగ్రత్తగా ఉండడం చేయాలి. ఒక వ్యక్తికి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చినప్పుడు సీపీఆర్ ని తీసుకోవాలి. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.