Honey Lemon Water : బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి ఉద‌యం తేనె, నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను తాగుతున్నారా ? అయితే ఇది చ‌ద‌వండి..!

Honey Lemon Water : ప్ర‌స్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య అధిక బ‌రువు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకు పోయి ఉంటుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల‌లో తేనె, నిమ్మ‌రసం క‌లుపుకుని తాగ‌డం ఒక‌టి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు చాలా మంది ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటిలో తేనె, నిమ్మ ర‌సం క‌లుపుకుని తాగుతూ ఉంటారు. ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొవ్వును తేనె క‌రిగిస్తుంద‌ని త‌ద్వారా బ‌రువు త‌గ్గుతార‌ని భావిస్తూ ఉంటారు. కానీ ఇది అంతా అపోహ మాత్ర‌మే అని.. తేనెకు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే శ‌క్తి లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

if you are drinking Honey Lemon Water then first read this
Honey Lemon Water

తేనెకే కాకుండా అస‌లు ఎటువంటి ఆహార ప‌దార్థానికి కూడా శ‌రీరంలో కొవ్వును నేరుగా క‌రిగించే శ‌క్తి లేద‌ని వారు చెబుతున్నారు. మ‌నం ఇడ్లీ, దోశ‌, ఉప్మా వంటి వాటిని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు 500 నుండి 550 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. మ‌న శ‌రీరానికి మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసే వ‌ర‌కు ఈ శ‌క్తి వినియోగం అవుతుంది. ఉద‌యం అల్పాహారంలో ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తిన‌కుండా కేవ‌లం మూడూ లేదా మూడున్న‌ర టీ స్పూన్ల తేనెను నీటిలో కలిపి తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి 200 నుండి 225 క్యాల‌రీల శ‌క్తి మాత్ర‌మే ల‌భిస్తుంది. మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యం వ‌రకు శ‌రీరానికి ఈ శ‌క్తి స‌రిపోదు. క‌నుక పేరుకు పోయిన కొవ్వును క‌రిగించి శ‌రీరం త‌న జీవ‌క్రియ‌ల‌కు వాడుకుంటుంది.

శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు క‌ర‌గ‌డం వ‌ల్ల‌ మ‌నం బ‌రువు త‌గ్గుతాము. కానీ తేనె నేరుగా శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వును క‌రిగించ‌దు. తేనె ప‌రిమాణంలో పంచ‌దార‌, బెల్లం, చెరుకు ర‌సాన్ని నీటిలో క‌లిపి తాగిన కూడా మ‌నం బ‌రువు త‌గ్గుతాము. కానీ వీటిని ఎక్కువ ప‌రిమాణంలో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని కలుగుతుంది. కనుక తేనె నీటిని తాగ‌డం ఉత్త‌మం. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఉద‌యం అల్పాహారంలో ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోకుండా తేనె నీటిని మాత్ర‌మే తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే బ‌రువు త‌గ్గుతారు. తేనె నీటితో పాటు అల్ప‌హారాన్ని కూడా తీసుకోవ‌డం వ‌ల్ల క్యాల‌రీలు అధిక‌మై బ‌రువు పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బరువు త‌గ్గాలంటే.. ఉద‌యం కేవ‌లం నిమ్మ‌ర‌సం, తేనె నీళ్ల‌ను మాత్ర‌మే తాగాలి. అలా చేస్తేనే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. దీని వ‌ల్ల పెద్ద‌గా ఆక‌లి కూడా వేయ‌దు. బ‌రువు తగ్గ‌డం తేలిక‌వుతుంది.

Share
D

Recent Posts