హెల్త్ టిప్స్

ప్ర‌యాణాల్లో ఉన్నారా.. ఆహారం విష‌యంలో ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణాలు చేస్తూనే వుంటారు. ప్రయాణాలలో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురవుతూంటాయి. ఇందుకుగాను ఆరోగ్యకరమైన తిండి పదార్ధాలు ఏం తినాలి అనేది పరిశీలించండి. ప్రయాణంలో వున్నపుడు సాధారణంగా ఏదో ఒక జంక్ ఫుడ్ తినేయాలని ఆరాటపడుతూంటాం. ఘుమఘుమ వాసనలు, రంగులతో బయటి తిండి పదార్ధాలు ఆకర్షిస్తాయి. వాటిని మీరు నియంత్రించుకోవాలి. అందుకుగాను ఏం చేయాలో చూడండి.

ప్రయాణించేటపుడు, కొద్దిపాటి డ్రైఫ్రూట్స్ లేదా వేరుశనగ పప్పు లేదా ఇతర సహజ ఆహారాలను వెంట వుంచుకోండి. బయటకనపడే వాటికి ఆకర్షించబడినపుడల్లా వీటిని తినండి. మీ ఆకలి తీరుతుంది. ఆరోగ్యంగానూ వుంటుంది. ఒకవేళ బయట వస్తువులు తినాలనిపిస్తే, వేడి బఠాణీ లేదా బటర్ లేకుండా స్వీట్ కార్న్ లేదా దోసకాయ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, కొబ్బరి బోండాం, అరటి పండు వంటివి తిని మీ ఆరోగ్యం కాపాడుకోండి. భోజనం ఏం చేయాలి? మీరే వండుకునేట్లు కొన్ని పదార్ధాలు, ఒక గిన్నె తీసుకు వెళ్ళండి. కొద్దిపాటి ఉడకపెట్టిన కూరలు, వాటితో రాగి ముద్ద లేదా నూనె లేని రొట్టెలు వేడిగా తింటే బాగుంటాయి.

if you are in travel do not make these mistakes

కూరలు ఉడికించిన నీటితోనే రాగి ముద్ద తయారు చేయవచ్చు. అన్నం లేదా కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే ఆహారాలు తీసుకోకండి. విమాన ప్రయాణాల్లో కూడా మీకు ఛాయిస్ ఇస్తారు. సలాడ్లు, పండ్లు వంటివి తినండి. వేయించిన పదార్ధాలు వద్దు. మైండ్ ఖాళీగా వుంటే కనపడేవి తినాలనిపిస్తుంది. కనుక చక్కటి మ్యూజిక్ వింటూ, ఒక పుస్తకం చదువుతూ లేదా సినిమా చూస్తూ ప్రయాణించి మంచి ఆహార ప్రణాళిక అమలు చేయండి. ఎంత నడవగలిగితే అంత నడవండి. ఎస్కలేటర్లు, లిఫ్టులు కాక, వీలు అయినపుడల్లా మెట్లు ఎక్కండి. వీలైనన్ని ప్రదేశాలు చూడండి. ఇది మిమ్మల్ని చురుకుగా ఎపుడూ చిన్నవారుగా వుండేలా చేస్తాయి.

Admin

Recent Posts