ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దలు అంటారు. అయితే అది కేవలం కొన్ని విషయాలకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే మనం కొత్త ఒక వింత, పాత ఒక రోత అనే సామెతను కూడా అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాడుతుంటాం. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా దాదాపు అలాంటిదే మరి. ఏం లేదండీ ఇప్పుడంటే గర్భాన్ని నిరోధించడం కోసం పురుషులకు, స్త్రీలకు వేర్వేరు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి కానీ ఒకప్పుడు అలా కాదు. అందుకే కొన్ని దేశాల్లో ఆ కాలంలో దంపతులు ఒక్కొక్కరు ఒక్కరు, ఇద్దరు కాదు, ఏడేసి, ఎనిమిదేసి ఇంకొందరు పదుల సంఖ్యలో కూడా పిల్లల్ని కనేవారు. అప్పుడు జనాభా నియంత్రణ, గర్భం రాకుండా నిరోధించడం వంటి పద్ధతులపై ప్రజల్లో సరిగ్గా అవగాహన లేదు. కానీ కేవలం కొద్ది మంది మాత్రమే ఆ పద్ధతులను పాటించేవారు. వారి సంఖ్య కూడా చాలా తక్కువే. అయితే వారు గర్భం రాకుండా ఉండేందుకు ఉపయోగించిన పద్ధతులను చూస్తే ఇప్పటి వారు షాక్ అవక తప్పదు. అలాంటి విపరీతమైన విధానాలను వారు అనుసరించేవారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
సగం కోసి పిండిన నిమ్మకాయ తొక్కలను అప్పట్లో కొందరు మహిళలు తమ జననాంగాల వద్ద పెట్టుకునేవారట. దాంతో నిమ్మరసం ఆ ప్రదేశమంతా వ్యాపించి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అక్కడికి వచ్చి చేరే శుక్ర కణాలను నాశనం చేస్తుందని వారు విశ్వసించే వారు. దీంతోపాటు ఆ ప్రదేశంలో ఉన్న బాక్టీరియా అంతా నశిస్తుందని కూడా వారు నమ్మేవారు. ఈ క్రమంలో కొందరు సఫలీకృతులు కూడా అయ్యేవారట. కోకా-కోలా… అవును, మీరు విన్నది నిజమే. కొంత మంది మహిళలు తమ యోనిలో కోకా కోలాను పోసుకునే వారట. దీని వల్ల అక్కడి శుక్రకణాలు చనిపోతాయని వారు నమ్మేవారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదట. అలా వారు ప్రయత్నించినా గర్భం వచ్చేదట.
బీవర్ తెలుసుగా. అదో రకోమైన జంతువు. దాని వృషణాలను కొంత మంది మహిళలు సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని నానబెట్టి అనంతరం వచ్చే ద్రవాన్ని ఆల్కహాల్‌తో కలిపి తాగేవారట. దీని వల్ల గర్భం రాకుండా ఉంటుందని వారి నమ్మకం. కానీ ఈ పద్ధతి కూడా అంతగా వర్కవుట్ అవలేదట. మొసలి మలాన్ని ఎండబెట్టి దాన్ని సెక్స్‌కు ముందు కొందరు మహిళలు తమ యోనిలో పెట్టుకునేవారట. అందువల్ల పురుషుల నుంచి వచ్చే వీర్యం యోని నుంచి గర్భాశయం లోపలికి వెళ్లకుండా ఉంటుందని వారు నమ్మేవారు. అకాసియా అనే ఓ మొక్కకు చెందిన ఆకులను తేనె, ఖర్జూరం కలిపిన మిశ్రమంలో నానబెట్టి వాటిని టాంపన్స్ అని పిలవబడే బిరడాల వంటి సహాయంతో కొందరు ఈజిప్షియన్ మహిళలు తమ యోనిలో పెట్టుకునేవారట. ఈ పద్ధతి వీర్యాన్ని నాశనం చేసే స్పెర్మిసైడ్‌గా పనిచేస్తుందని చెబుతారు.
పంది పేగులను వేడి పాలలో నానబెట్టి వాటిని శుద్ధి చేసి కొందరు పురుషులు వాటిని కండోమ్‌లుగా అప్పట్లో ఉపయోగించేవారట. అప్పట్లో కొంత మంది జర్మన్ మహిళలు గర్భ నిరోధకంగా ఈ పద్ధతిని వాడేవారట. స్వర్ణకారులు వేడి చేసిన లోహాన్ని చల్లబరచడం కోసం ఉపయోగించే ఓ ప్రత్యేకమైన ద్రవాన్ని మహిళలు గర్భ నిరోధకంగా వాడే వారట. అయితే దీని వల్ల కొందరిలో సంతాన లేమి, నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడ్డాయట. ఇంకొందరు ఈ పద్ధతి బారిన పడి చనిపోయినట్టు కూడా సమచారం.