స్థూలకాయం, బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులు ఉంటే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి తోడు కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే ఆ విధంగా కూడా ఆ వ్యాధులు మనకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు శరీరంలో అప్పుడప్పుడు కనిపించే పలు లక్షణాలను గమనించడం ద్వారా కూడా గుండె జబ్బులు వస్తాయని ముందుగానే తెలుసుకోవచ్చు. అలాంటి లక్షణాల్లో ఒకటి చెవి వెంట్రుకలు, మరొకటి చెవి తమ్మెలు ముడతలు పడడం. అవును, మీరు విన్నది నిజమే.
చెవుల్లో వెంట్రుకలు పెరుగుతుంటే అలాంటి వారికి త్వరలో గుండె జబ్బులు వస్తాయట. దీంతోపాటు చెవి తమ్మెలు సక్రమంగా లేక ముడతలు పడుతున్నా వారికి కూడా గుండె జబ్బులు వస్తాయట. పలువురు పరిశోధకులు తాజాగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. అయితే ఇవే కాదు వారి పరిశోధనల్లో మరో విషయం కూడా తెలిసింది. అదేమిటంటే టెస్టోస్టిరాన్ స్థాయిలు.
టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్థాయిలు శరీరంలో సక్రమంగా లేకపోయినా అలాంటి వారికి గుండె జబ్బులు వస్తాయట. అదే టెస్టోస్టిరాన్ సరిగ్గా ఉంటే శరీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుందట. పైన చెప్పిన మూడు కారణాల వల్ల హార్ట్ ఎటాక్స్ కూడా వస్తాయట. కాబట్టి మీరు కూడా చెవుల్లో వెంట్రుకలు పెరుగుతన్నాయో లేదో చూడండి. అలా పెరుగుతుంటే వెంటనే వాటిని కట్ చేయండి. అలా చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందట. దీంతోపాటు చెవి తమ్మెలను కూడా ఒకసారి పరిశీలించండి. అవి ముడతలు పడుతున్నాయో లేదో చూడండి. దీంతో గుండె జబ్బులను రాకుండా చూసుకోవచ్చు.