హెల్త్ టిప్స్

ఈ ఆహారాన్ని తిరిగి వేడి చేస్తే విషంగా మారుతుందా?

ఇటీవ‌ల చాలా మంది ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంటారు. నేటి బిజీ జీవనశైలితో, రోజుకు రెండుసార్లు భోజనం చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఫలితంగా, చాలా మంది మునుపటి రోజు ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తారు. అయితే కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? అన్నం సహా 4 ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేస్తే తీవ్ర అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం చల్లని ఆహారం తినలేక.. ఫుడ్‌ వేడి చేసి తింటారు. కానీ, ఆహారాన్ని పదేపదే వేడి చేయండం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా వేడి చేస్తే వాటిలోని పోషకాలు నాశనం అవ్వ‌డ‌మే కాకుండా కొన్ని సార్లు టాక్సిన్స్‌ ఫామ్‌ అయ్యి ఆరోగ్యానికి హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది ఉద‌యం మిగిలిన అన్నాన్ని.. సాయంత్రం వేడి చేసి తింటూ ఉంటారు. ఇలా వేడి చేస్తే అన్నంలోని పోషకాలు న‌శించిపోతాయి. అదే కాకుండా, అన్నంలోని బ్యాక్టీరియా ట్యాక్సిన్లను విడుదల చేయడం వల్ల అది విషతుల్యంగా మారుతుంది. టాక్సిన్ల వల్ల వాంతులు, డయేరియా వంటి అనారోగ్యాలకు కారణమవుతాయి. ఇక మ‌నం ఈ మ‌ధ్య ఆకు కూర‌ల‌ని కూడా ఎక్కువ‌గా తీసుకుంటూ ఉన్నాం.వారానికి ఒకసారైన.. పాలకూర, ఇతర ఆకు కూరలతో వంటలు చేసుకుంటూ ఉంటాం. కర్రీ మిగిలితే.. ఫ్రిజ్‌లో పెట్టి నెక్స్‌ట్‌ డే వేడి చేసి తింటూ ఉంటాం. కానీ, ఆకు కూరలను ఎక్కువగా ఉడికించినా, పదేపదే వేడి చేసినా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరల్లో ఐరన్‌ మెండుగా ఉంటుంది. పదే పదే వేడి చేస్తే.. ఐరన్ ఆక్సైడ్‌గా మారిపోతుంది. దాని వ‌ల‌న అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

if you are reheating foods then know this

క్యారెట్‌ను అతిగా ఉడికించినా, రెండో సారి వేడి చేసినా ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిల్లో ఉండే ఐరన్‌, నైట్రేట్లు… ఇతర పోషకాలు తిరిగి వేడి చేస్తే మన శరీరానికి హాని చేసే ప్రమాదం ఉంది. చికెన్‌, మటన్‌ కర్రీ మిగిలితే.. ఫ్రిజ్‌లో పెటుక్కుని.. ఆ తర్వాత రోజు వేడి చేసి తింటూ ఉంటారు. కానీ చికెన్‌, మటన్‌ మళ్లీ వేడి చేస్తే అందులోని ప్రొటీన్ కంపోజిషన్ మారిపోతుంది. మళ్లీ వేడి చేసిన నాన్‌వెజ్‌ తింటే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.పుట్టగొడుగులు.. వెజిటేరియన్స్‌ నాన్‌ వెజ్‌. పుట్టగొడుగల కర్రీని పదేపదే వేడి చేసినా, నిల్వ ఉంచి తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ఉడకబెట్టిన వెంటనే తినడం మంచిది. దాన్ని రీహీట్‌ చేస్తే.. అందులోని పోషకాలు తొలగుతాయి. ఎగ్స్‌ మళ్లీ వేడి చేస్తే.. దానిలోని నైట్రోజన్‌ క్యాన్సర్‌ కారక ఫ్రీరాడికల్స్‌ని విడుదల చేస్తుంది. అందుకే ఈ ఆహారాల‌ని మ‌రో సారి వేడి చేసి తిన‌క‌పోవ‌డం మంచిది.

Admin

Recent Posts