Breakfast : ఉరుకుల జీవితం కారణంగా మనలో చాలా మందికి ఆహారాన్ని తీసుకునే సమయం కూడా ఉండదు. చాలా మంది ఉదయాన్నే తమ రోజును హడావిడిగా ప్రారంభిప్తూ ఉంటారు. దీంతో సమయం తక్కువగా ఉండడం చేత ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తూ ఉంటారు. నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట అల్పాహారం చేయడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. మన ఆలోచనా శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఉదయం పూట అల్పాహారం చేయడం వల్ల మన శరీర బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం మానేస్తే మనం అనేక అనారోగ్య సమస్యలను, దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వల్ల నీరసం వస్తుంది. మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతాము. శరీరం శక్తి విహీనంగా తయారవుతుంది. ఏ పనిని కూడా సరిగ్గా చేయలేకపోతాము. కనుక అన్ని పోషకాలు శరీరానికి అందేలా ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవాలి. అలాగే ఉదయంపూట అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతాము. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
కనుక మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఉదయం పూట తీసుకోవాలి. అలాగే ఉదయం పూట తినకపోవడం వల్ల ఆకలి ఎక్కువవుతుంది. దీంతో మనం అతిగా ఆహారాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మనం బరువు పెరగవచ్చు. కనుక బరువును అదుపులో ఉంచే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇక ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఉంది. కనుక విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ ఉండే పండ్లు, కూరగాయలు, జ్యూస్, గింజలను ఉదయం పూట తీసుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే ఉదయం పూట తినడం మానేయడం వల్ల జీవక్రియల రేటు తగ్గుతుంది. జీర్ణశక్తి పనితీరు కూడా తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక పోషకాలతో కూడా అల్పాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యలు, ఊబకాయం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఉదయం పూట అల్పాహారం మానేయడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కనుక రోజూ ఉదయం పూట మన వీలును బట్టి ఏదో ఒక ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.