హెల్త్ టిప్స్

మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా.. రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

భారతదేశంలో దాదాపు 22శాతం జనాభా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారని నిపుణుల అభిప్రాయం. చాలా మందికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. పేగులని ఖాళీ చేసుకోకపోతే వచ్చే అనేక ఇబ్బందులు చికాకు కలిగిస్తుంటాయి. మలబద్దకం సమస్య రావడానికి గల ముఖ్య కారణాల్లో మొదటిది మన జీవన విధానం. ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడడం అతిగా తాగడం, పొగ పీల్చడం వంటి వాటివల్ల మలబద్దకం అనేది సమస్యగా తయారవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వాముని(ఓమ) నీటిలో కలుపుకుని తాగినా, త్రిఫల చూర్ణాన్ని నీళ్ళలో కలుపుకుని సేవించినా సరిపోతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తింటే మలబద్దకం దూరమవుతుంది.

ఐతే మలబద్దకాన్ని నివారించడానికి పండ్లు కూడా సాయపడతాయి. ఆపిల్ లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల మలబద్దకం సహా డయేరియా నుండి కూడా విముక్తి కలుగుతుంది. రోజుకి ఒక‌ ఆపిల్ తినమని డాక్టర్లు ఊరికే చెప్పలేదు మరి. నారింజలో విటమిన్ సి తో పాటు అధిక ఫైబర్ ఉంటుంది. నారింజ తొనల్ని తిన్నా, జ్యూస్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్ని పాతాళంలోకి చేరుస్తుంది.

if you are suffering from constipation follow these tips

అరటి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పేగుల్లోని వ్యర్థపదార్థం బయటకి సులభంగా తొలగిపోతుంది. ఒక కప్పు బెర్రీలల్లో 8శాతం ఫైబర్ ఉంటుంది. పేగులని శుభ్రం చేయడానికి ఇవి బాగా పనిచేస్తాయి. బెర్రీలని డైరెక్టుగా ఆహారంగా తీసుకోవచ్చు. పచ్చి బెర్రీలని తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

Admin

Recent Posts