ప్రస్తుత కాలంలో శీతల పానీయాల వినియోగం మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.. ముఖ్యంగా వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ వినియోగం చాలా పెరుగుతుంది. వాస్తవానికి ఈ సమయంలో మనమందరం చల్లగా, రుచికరంగా ఉండే శీతల పానీయాలను ఇష్టపడతాము. కానీ, ఈ అలవాటు దాని పరిమితులను దాటితే, అది అనేక హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాఫ్ట్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం.. దీనిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.. అందుకే శీతల పానీయాలు తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ డైటీషియన్ల ప్రకారం శీతల పానీయాలు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకోండి..
ఎక్కువగా శీతల పానీయాలు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గుతుంది. ఇది మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి ప్రయత్నించి మీ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.. దీనివల్ల మీరు జీర్ణ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.. మీకు అజీర్ణం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, వీలైనంత వరకు అలాంటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. అధిక శీతల పానీయాలలో ఉండే అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి మీ రక్తపోటును పెంచుతాయి.. దీనివల్ల గుండె జబ్బులకు కారణమవుతుంది.
శీతల పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి మీ బరువును పెంచుతాయి. దీని కారణంగా మీ బరువు నియంత్రణలో ఉండదు.. మీరు బరువు పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. కొన్ని శీతల పానీయాలలో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది.. ఇది మీ నాడీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వలన మీరు నిద్రలేమి, ఉద్రిక్తత, అధిక ఒత్తిడిని అనుభవించవచ్చు. మీరు ఎక్కువగా శీతల పానీయాలు తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు, ఇది విషం కంటే తక్కువ కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అందుకే.. సాధ్యమైనంత వరకు శీతల పానీయాలకు దూరంగా ఉండటం బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.