ఆధ్యాత్మికం

ఈ చిన్న మంత్రం ..ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఓం త్రయంబకం యజామహే&comma; సుగంధిం పుష్టి వర్ధనం&comma; ఉర్వారుక మివ బంధనాత్&comma; మృత్యోర్ ముక్షీయ మామృతాత్&period;&period; మనిషికి ఆయురారోగ్యాన్ని&comma; సౌభాగ్యాన్ని దీర్ఘాయువును&comma; ప్రశాంతతను&comma; సంతోషాన్ని ఇచ్చేదే మహా మృత్యుంజయమంత్రం&period; శైవులు దీనిని రుద్రాభిషేకంలో&comma; వైష్ణవులు పాంచరాత్రం దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మంత్రం పరమ పవిత్రమైనది&comma; అత్యంత ప్రాచుర్యమైనది&period; క్షీర సాగర మథనంలో వచ్చిన విషాన్ని పరమేశ్వరుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు&period; అందుకే ఈ మంత్రం జపించిన వారంతా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందుతారని భక్తుల విశ్వాసం&period; మహా మృత్యుంజయ మంత్రాన్ని సంజీవని మంత్రం అని&comma; మార్కండేయ మంత్రం అని కూడా అంటారు&period; అనుకోని ఆపదలు చుట్టుముట్టినప్పుడు&comma; బతుకుపై విరక్తి కలిగిప్పుడు&period;&period;కాసేపు ఈ మంత్రాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75949 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mantram-1&period;jpg" alt&equals;"read this mantra to save yourself from accidents " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సకల రోగాల నుంచి ఉపశమనం కల్పించి&comma; అపమృత్యు భయాన్ని తొలగించి&comma; ప్రమాదాల నుంచి రక్షించే శక్తి ఈ మంత్రానికి ఉంటుందంటారు&period; అందరికి శక్తి నిచ్చే ముక్కంటి&comma; సుగంధ భరితుడు అయిన శివుడిని నేను పూజిస్తున్నాను&period; దోస పండును తొడిమ నుంచి వేరు చేసినట్టు మృత్యు బందనం నుంచి నన్ను విడిపించి అమరత్వాన్ని ప్రసాదించగాక&period;&period; అని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మంత్రాన్ని నిత్యం 3 సార్లు&comma; 9 సార్లు కుదిరితే 108 సార్లు పారాయణం చేస్తారు&period; ఈ మంత్రాన్ని భక్తిపూర్వకంగా జపిస్తే దైవ ప్రకంపనలు మొదలై&comma; చుట్టూ ఆవరించి ఉన్న దుష్ట శక్తులు మాయమవుతాయి&period; ఎందుకంటే ఈ మంత్రాన్ని పఠించిన వారి చట్టూ ఓ శక్తివంతమైన వలయం ఏర్పడుతుందని చెబుతారు&period; అందుకే ప్రమాదాల బారినుంచి &comma; దురదృష్టం నుంచి బయటపడేందుకు మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు&period; ప్రాతః కాలంలో అయినా సంధ్యా సమయంలో అయినా ఎప్పుడైనా మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts