Plastic Water Bottles : ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్‌ను వాడుతున్నారా.. ఇలా చేయ‌క‌పోతే మీ ఆరోగ్యానికి ఎంతో న‌ష్టం జ‌రుగుతుంది..!

Plastic Water Bottles : మ‌న శ‌రీరానికి నీరుఎంతో అవ‌స‌రం. నీరు ఎంత ఎక్కువ‌గా తాగితే అంత ఆరోగ్య‌వంతులుగా ఉండ‌వ‌చ్చు. రోజుకు క‌నీసం నాలుగు లీట‌ర్ల నీటిని తాగాలి. అంతేకాదు మ‌నకు ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే త‌గిన‌న్ని మంచి నీటిని తాగ‌డం ఎంతో అవ‌స‌రం. మనం తాగేది మంచి నీరే క‌దా అని మ‌న‌లో చాలా మంది సందేహం వ్య‌క్తం చేస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది బాటిల్స్ లో నీటిని నింపుకుని తాగుతూ ఉంటారు. అలాగే బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు, ఆఫీస్ ల‌కు వెళ్లేట‌ప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని నింపుకుని తీసుకువెళ్తుంటాం.

బ‌య‌ట‌కు వెళ్లిన త‌రువాత కూడా బ‌య‌ట దొరికే ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీటిని తాగుతున్నాం. అలాగే పిల్ల‌లకు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని నింపి స్కూల్ కు పంపిస్తూ ఉంటాం. మ‌నం వాడే ఈ బాటిల్స్ ను రోజూ శుభ్రం చేయము. ఈ బాటిల్స్ ను శుభ్రం చేయ‌క‌పోతే ముందు ముందు మ‌నం తీవ్ర‌మైన వ్యాధుల‌కు గురి కావ‌డం త‌ప్ప‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం త‌ర‌చూ ఉప‌యోగించే ఈ బాటిల్స్ పై నిపుణులు కొన్ని ప‌రిశోధ‌న‌లు చేసారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో వారు కొన్ని భ‌యంక‌ర‌మైన నిజాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

if you are using Plastic Water Bottles then you should know this
Plastic Water Bottles

మ‌నం వాడే ఈ బాటిల్స్ లో 3,13,400 సీఎఫ్‌యూ బ్యాక్టీరియాలు ఉన్నాయని వారు తెలియ‌జేశారు. ఇక ప్లే గ్రౌండ్స్ లో వాడే ప్లాస్టిక్ బాటిల్స్ లో 9,00,000 కు పైగా సీఎఫ్‌యూ బ్యాక్టీరియాలు ఉన్నాయ‌నే భ‌యంక‌ర‌మైన నిజాల‌ను వారు బ‌య‌ట‌పెట్టారు. ఈ బ్యాక్టీరియాల్లో కూడా 90 శాతం హానిక‌ర‌మైన బ్యాక్టీరియాలే ఉన్నాయ‌ట‌. వీటి వ‌ల్ల మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ను వాడ‌కుండా మ‌నం ఉండ‌లేము. క‌నుక వీటిని మ‌నం సాధ్య‌మైనంత వ‌ర‌కు శుభ్ర‌ప‌రుచుకోవాలి.

ముందుగా ఈ బాటిల్స్ లో వేడి నీటిని పోసి త‌రువాత చిటికెడు డిష్ వాష్ ను చేసి శుభ్ర‌ప‌రుచుకోవాలి. అలాగే డ్రై వాట‌ర్ బాటిల్ లో బియ్యం, ఉప్పు, బేకింగ్ సోడా వేసి అర గంట పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బాటిల్ లో ఉండే క్రిములు న‌శించ‌డంతో పాటు బాటిల్ వాస‌న కూడా రాకుండా ఉంటుంది. అదే విధంగా బాటిల్ లో నీళ్లు, వెనిగ‌ర్ వేసి బాగా క‌లి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే బాటిల్ ను శుభ్ర‌ప‌రుచుకోవాలి.

ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల బాటిల్ లో ఉండే వాస‌న పోవ‌డంతోపాటు బాటిల్ కొత్త‌దానిలా మెరుస్తుంది. ఇలా కేవ‌లం వాట‌ర్ బాటిల్స్ నే కాకుండా ప్లాసిక్ వాట‌ర్ కంటైన‌ర్ ల‌ను, జార్ ల‌ను కూడా శుభ్ర‌ప‌రుచుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటించి బాటిల్స్ ను శుభ్ర‌ప‌రుచుకోవ‌డం వ‌ల్ల బాటిల్స్ లో ఉండే క్రిములు దాదాపు న‌శించిపోతాయి. ఇలా శుభ్ర‌ప‌రుచుకున్న బాటిల్స్ లో నిల్వ చేసుకున్న నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts