Heart Attack : దంతాల నొప్పికి, గుండె పోటుకు సంబంధం ఏమిటి ?

Heart Attack : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దంత సంబంధిత స‌మ‌స్య‌ల్లో పంటి నొప్పి కూడా ఒక‌టి. ప్ర‌తి ప‌ది మందిలో ఆరుగురు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. స‌రిగ్గా దంతాలను శుభ్రం చేసుకోక‌పోవ‌డం, తీపి మ‌రియు చ‌ల్ల‌టి ప‌దార్థాల‌ను తిన‌డం వంటి వాటిని దంతాల నొప్పులు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. నాసిర‌కం టూత్ పేస్ట్ లను వాడినా కూడా దంతాల నొప్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

చాలా మంది ఈ దంతాల నొప్పుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ ఉంటారు. వాటికి త‌గిన చికిత్స తీసుకోరు. ఈ నిర్ల‌క్ష్య‌మే మ‌న ప్రాణాల‌కు హాని క‌లిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పంటి నొప్పే క‌దా నిర్ల‌క్ష్యం చేస్తే అది గుండెపోటుకు దారి తీసే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ముందు పంటి నొప్పి బారిన ప‌డిన వారు త‌రువాత హార్ట్ ఎటాక్ కు గురి అయిన‌ట్టు వారు క‌నుగొన్నారు.

what is the relation between teeth pain and heart attack
Heart Attack

పంటి న‌రాల‌కు అలాగే గుండె న‌రాల‌కు సంబంధాలు అధికంగా ఉంటాయి. ఈ దంతాల నొప్పులతో బాధ‌ప‌డే వారు త‌గిన చికిత్స తీసుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తూ సాదా సీదా వైద్యం తీసుకుంటే ఏదో ఒక రోజూ పంటి న‌రాల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఈ ఒత్తిడి గుండెను తాకి గుండె పోటుకు దారి తీస్తుంద‌ని నిపుణులు హెచ‌రిస్తున్నారు. దంతాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు స‌రైన వైద్యం చేయించుకోవ‌డం ద్వారా దంతాల‌తోపాటు గుండెను కూడా కాపాడుకున్న వాళ్లం అవుతాము. దంతాల నొప్పులే క‌దా అని నిర్ల‌క్ష్యం చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

D

Recent Posts