Kidney Stones : దేవతలు అమృతం తాగారని అందుకే వారికి మరణం ఉండదని మనందరికి తెలిసిందే. కానీ అమృతం కంటే గొప్పదైనమొక్క గురించి ఆయుర్వేదం గ్రంథాలలో తెలుపబడింది. ఆ మొక్కే తెల్ల గలిజేరు. ఇది గ్రామాల్లో ఎక్కువగా కనబడుతుంది. ఈ మొక్కను సంస్క్రతలో పునర్నవ అని పిలుస్తారు. పునర్నవ అంటే మళ్లీ నవత్వం ఇవ్వగలదని అర్థం. ఈ పేరుతోనే ఈ మొక్క అద్భుతమైన సామార్థ్యాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొక్కలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడుతుంది.
ఆయుర్వేదంలో అనేక రకాల సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. కఫ, వాత, పిత్త దోషాలను నయం చేయడంలో తెల్ల గలిజేరు మనకు సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ మొక్కను ఉపయోగించి ఎటువంటి మూత్రపిండాల సమస్యనైనా నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లను సైతం తొలగించే శక్తి ఈ మొక్కకు ఉందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
మనదేశంలో చాలా మంది మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. ఆధునిక వైద్య పద్ధతులు ఎన్ని వచ్చినా మూత్ర పిండాల వైఫల్యం అనే సమస్యను అధిగమించి తిరిగి ఆరోగ్యవంతులుగా మారిన వారు చాలా తక్కువగా ఉన్నారు. ఇటువంటి మూత్రపిండాల సమస్యలను తగ్గించడంలో తెల్లగలిజేరు మొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మొక్కను ఆకుకూరగా కూడా తీసుకుంటారు. గలిజేరు మొక్కతో పప్పు, పొడి కూర వంటివి చేసుకుని తింటారు.
అంతేకాకుండా ఈ మొక్క ఆకులను నేరుగా తీసుకున్నా లేదా ఆకుల రసాన్ని తీసుకున్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. తెల్లగలిజేరు మొక్కను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. తెల్లగలిజేరు మొక్కను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు లభించి పుష్టిగా, ఆరోగ్యవంతంగా తయారవుతారని నిపుణులు చెబుతున్నారు.