హెల్త్ టిప్స్

ఈ క‌ప్స్‌లో మీరు టీ, కాఫీ తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకో తెలుసా..?

ఇంట్లో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా టీ, కాఫీ వంటి వాటిని క‌ప్పులు లేదా గ్లాస్‌ల‌లో తాగుతారు. అదే బ‌య‌టికి వెళ్తే ప్లాస్టిక్‌, పేప‌ర్ క‌ప్స్, కొన్ని సార్లు సాధార‌ణ క‌ప్పుల్లోనూ వాటిని తాగుతారు. అయితే మీకు తెలుసా..? స‌్టైరోఫోమ్ (Styrofoam) అనే ప‌దార్థంతో చేసిన క‌ప్పుల్లో కూడా కొంద‌రు టీ, కాఫీ విక్ర‌యిస్తున్నారు. అయితే నిజానికి అవి మ‌న‌కు ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. వాటి వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ముప్పు క‌లుగుతుంద‌ట‌. ముఖ్యంగా థైరాయిడ్‌, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

Styrofoam క‌ప్స్ చూసేందుకు అచ్చం పేప‌ర్ క‌ప్స్ లాగే ఉంటాయి. కానీ అవి పేప‌ర్ క‌ప్స్ కావు. ప్లాస్టిక్ క‌ప్స్‌. ఓ ర‌క‌మైన ప్లాస్టిక్‌తో వాటిని త‌యారు చేస్తారు. గ్యాస్‌లోకి Polystyrene అనే ప‌దార్థాన్ని ఎక్కిస్తే polystyrene foam ఏర్ప‌డుతుంది. దాన్ని ఉప‌యోగించి Styrofoam క‌ప్స్ త‌యారు చేస్తారు. దీంతో అవి చూసేందుకు అచ్చం పేప‌ర్ క‌ప్స్‌లాగే ఉంటాయి. కానీ అవి పేపర్ క‌ప్స్ కావు. కాబ‌ట్టి ఇలాంటి క‌ప్స్ గ‌న‌క మీకు క‌నిపిస్తే వాటిలో మాత్రం టీ, కాఫీ తాగ‌కండి. ఎందుకంటే…

if you are using this type of cups for tea and coffee then know this

Styrofoam క‌ప్స్ లో టీ, కాఫీ లేదా ఇత‌ర ద్ర‌వాలు పోసిన‌ప్పుడు ఆ క‌ప్స్‌లో ఉండే Styrene అనే ప‌దార్థం ఆ ద్రవంలోకి సుల‌భంగా వెళ్తుంది. ఈ క్ర‌మంలో ఆ ద్ర‌వాన్ని తాగితే Styrene మ‌న శ‌రీరంలోకి వెళ్తుంది. అది కార్సినోజెన్ క‌నుక క్యాన్సర్ వ్యాధిని క‌ల‌గ‌జేస్తుంది. దీంతో థైరాయిడ్ స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఈ క‌ప్స్‌తో జాగ్ర‌త్త‌. ఎప్పుడైనా మీరు బ‌యట టీ, కాఫీ లేదా ఇత‌ర ఏ ద్ర‌వాలు తాగినా ఇలాంటి క‌ప్స్‌లో తాగకండి. పేప‌ర్ క‌ప్స్‌లో తాగితే బెట‌ర్‌. దాంతో ఆరోగ్యం బాగుంటుంది. ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి..!

Admin

Recent Posts