Toothpaste : మనం ఉదయం లేవగానే ప్రతిరోజూ దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. దంతాలను శుభ్రం చేసుకోవడానికి మనం టూత్ బ్రష్ ను, టూత్ పేస్ట్ ను ఉపయోగిస్తూ ఉంటాం. మనం ప్రతిరోజూ వాడే ఈ టూత్ పేస్ట్, టూత్ బ్రష్ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి వస్తువుకు కూడా ఎక్స్ ఫైరీ తేదీ ఉంటుంది. అలాగే మనం వాడే టూత్ బ్రష్, టూత్ పేస్ట్ కు కూడా ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది. ఒక బ్రష్ ను రెండు నెలలకంటే ఎక్కువగా ఉపయోగించకూడదు లేదా 200 సార్ల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. ఒకే టూత్ బ్రష్ ను కొందరూ నెలలు వాడేస్తూ ఉంటారు. మరీ కొందరైతే దానిని సంవత్సరం పాటు ఉపయోగిస్తారు. టూత్ బ్రష్ ను రెండు నెలలు వాడిన తరువాత మార్చేస్తూ ఉండాలని దంత వైద్యులు చెబుతున్నారు.
అలాగే కొందరు ఉదయం బ్రష్ చేసేటప్పుడు దంతాలు అరిగిపోయేలా బ్రష్ చేస్తూ ఉంటారు. మరికొందకు అటూ ఇటూ తోమేసి హడావిడిగా ముగించేస్తారు. దంతాలను కనీసం రెండు నిమిషాలైనా పాటైన శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. నోరు శుభ్రపడాలంటే రెండు నిమిషాల కంటే తక్కువ కాకుండా దంతాలను శుభ్రపరుచుకోవాలి. మందంగా, గట్టిగా ఉండే బ్రష్ లు చిగుళ్లను దెబ్బతీస్తాయి. కనుక సున్నితంగా ఉండే బ్రష్ లను వాడాలి. బ్రష్ చేసుకున్న వెంటనే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిస్తూ ఉంటాం. నోటిని శుభ్రపరుచుకుని వచ్చేస్తూ ఉంటాం. కానీ బ్రష్ చేసుకున్న తరువాత ఆ నురుగంతా ఉమ్మేసిన తరువాత ఒక అర గంట పాటు అలాగే ఉండాలట. అర గంట తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించాలట. చాలా మంది రోజూ ఒక పూట మాత్రమే దంతాలను శుభ్రం చేసుకుంటారు. కానీ దంతాలను మూడు పూటలా శుబ్రం చేసుకుంటే మంచిదట.
వీలు కానీ వారు కనీసం రోజుకు రెండు పూటలా దంతాలను శుభ్రం చేసుకోవాలట. ఇప్పుడు టూత్ పేస్ట్ ల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో దంతాలను శుభ్రం చేసుకోవడానికి బొగ్గును, వేప పుల్లను ఉపయోగించే వారు. వీటిని ఉపయోగించడం వల్ల వారు చక్కటి దంతాలను కలిగి ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో వాటి వాడకం తగ్గి క్రమేనా టూత్ పేస్ట్ లను వాడడం ఎక్కువైంది. మనకు మార్కెట్ లో రకరకాల టూత్ పేస్ట్ లు లభ్యమవుతూ ఉంటాయి. వాటిలో ఏది రసాయనాలు కలిగి ఉందో ఏది సహజ సిద్దమైందో చాలా మందికి తెలియదు. తెల్లగా ఉండే టూత్ పేస్ట్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీని వల్ల మన దంతాలపై ఒక పొరలాగా ఏర్పడి దంతాల అరుగుదలను నివారించే విషయంలో ఎంతో ఉపయోగంగా ఉంటుంది. టూత్ పేస్ట్ ల కింది భాగంలో ఎరుపు, నలుపు, బ్లూ, ఆకుపచ్చ రంగుల్లో గుర్తులు ఉంటాయి.
ఆ గుర్తు టూత్ పేస్ట్ ను ఏ పదార్థాలతో తయారు చేసారో అది సహజసిద్దమైందో కాదో తెలియజేస్తాయి. టూత్ పేస్ట్ కింది భాగంలో నలుపు రంగులో గీత ఉంటే అది వంద శాతం రసాయనాలతో తయారు చేసారని అర్థం. ఆ గీత ఆకుపచ్చ రంగులో ఉంటే టూత్ పేస్ట్ వంద శాతం సహజ సిద్దమైందని అర్థం. నీలి రంగులో గీత ఉంటే ఆ టూత్ పేస్ట్ ను సహజసిద్దమైన మెడికల్ పదార్థాలను కలిపి తయారు చేసారని అర్థం. ఒకవేళ గీత ఎరుపు రంగులో ఉంటే ఆ టూత్ పేస్ట్ ను సహజసిద్దమైన రసాయనాలతో తయారు చేసారని అర్థం చేసుకోవాలి. టూత్ పేస్ట్ వల్ల థైరాయిడ్ సమస్యలు కలుగుతాయని అనగానే చాలా మంది ఇది నిజం కాదు అని భావిస్తారు. కానీ క్రిములను నాశనం చేసే టూత్ పేస్ట్ లలో ట్రిక్లోసన్ అనే రసాయనాన్ని కలుపుతారు.
ఈ రసాయనాన్ని పురుగు మందుల్లో వాడే వారు. ఈ రసాయనాన్ని కలిగి ఉన్న టూత్ పేస్ట్ లను వాడడం వల్ల థైరాయిడ్ సమస్య, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి బారిన పడతామని నిపుణులు చెబుతున్నారు. దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్ ఈ రెండింటిలో ఏదో ఒకటే ఉపయోగించాలి. టూత్ పౌడర్ ను వాడే వారు అది మెత్తగా ఉండేలా చూసుకోవాలి. మంచి కంపెనీ, బ్రాండ్ ఉన్న టూత్ పేస్ట్ లను ఉపయోగించాలి. టూత్ పేస్ట్ రంగు, రుచి, వాసనకు బదులుగా దాని పనితీరు చూసి కొనుగోలు చేయాలి. ఆహారం తీసుకునే సమయంలో దంతాలు జివ్వుమన్నట్టు ఉంటే మెడికేటెడ్ టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి.