సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ, మంచి కన్నా చెడుకే ఎక్కువ వినియోగిస్తున్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చాక అసలు దాపరికం, చాటుమాటు వ్యవహారం లేకుండా పోయాయి. ఇక అసలు విషయానికి వస్తే, భారత్లోనేకాకప్రపంచవ్యాప్తంగా నీలిచిత్రాలు చూసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ ప్రంపంచం విస్తరించడం ఓ కారణమయితే స్మార్ట్ ఫోన్ కూడా అంతకు మించిన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా నీలి చిత్రాలను చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలను చూడటం వల్ల యూజర్లకు తెలియకుండానే చాలా సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.
యూజర్లకు తెలియకుండానే కొన్ని రకాల ప్యాక్ లు సబ్ స్క్రైబ్ అవ్వడం, ఫోన్ బ్యాలెన్స్ కట్ అవ్వడం వంటివి జరుగుతాయట. నీలి చిత్రాల వెబ్ సైట్ ను చూడటం ఫ్రీ అయినా, యూజర్లు గుర్తించలేని విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్యాక్స్ సబ్ స్క్రైబ్ అయ్యేలా అక్రమాలకు పాల్పడుతుంటాయట. నీలి చిత్రాల వెబ్ సైట్స్ చూస్తున్న యూజర్లకు తెలియకుండానే కొన్ని రకాల యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లో అటోమెటిక్ గా డౌన్ లోడ్ అవుతాయట. వాటి ద్వారా ఫోన్లలోకి వైరస్ ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక కొన్ని రకాల నీలి చిత్రాల వెబ్ సైట్స్ చూడాలంటే మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు తప్పనిసరి.
తెలియక ఆ వివరాలను అందిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రిమినల్ యాక్టివిటీస్ కు పాల్పడే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ బాపతు వ్యవహారాలు చాలావరకూ సైబర్ నేరాలకింద నమోదయ్యాయి కూడా.