హెల్త్ టిప్స్

Kidney Stones : కిడ్నీ స్టోన్లు ఉన్నాయా.. ఈ 5 చిట్కాల‌ను పాటించండి..!

Kidney Stones : ఈరోజులలో వయసుతో సంబంధం లేకుండా, చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. కిడ్నీ సమస్యలతో కూడా, చాలామంది సతమతమవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే, కచ్చితంగా సరైన జీవన విధానాన్ని పాటించాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కిడ్నీ స్టోన్స్ తో కూడా చాలామంది బాధపడుతున్నారు. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు, కచ్చితంగా ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళలో, నొప్పి విపరీతంగా ఉంటుంది. నొప్పి నుండి ఉపశమనం లభించడానికి, వీటిని కచ్చితంగా పాటించడం మంచిది.

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు, నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే, పలు చిట్కాలు అని పాటిస్తే, నొప్పి నుండి ఉపశమనం కచ్చితంగా కలుగుతుంది. ఎక్కువ నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. నీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. నీళ్లతో పాటుగా, ఇతర ఫ్లూయిడ్స్ ని కూడా ఎక్కువగా తీసుకోండి. రోజుకి 2 1/2 లీటర్ల వరకు నీళ్లు తాగండి. అంటే, పది కప్పుల వరకు రోజు నీళ్లు తీసుకుంటే, నొప్పి నుండి ఈజీగా బయటపడొచ్చు.

if you have kidney stones then do like this

నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం, అధిక ఆక్సిలేట్ కంటెంట్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే, నొప్పి నుండి ఈజీగా బయటపడొచ్చు. చాక్లెట్స్, నట్స్, బీట్స్, పాలకూర వంటి వాటిని తీసుకుంటే, రిలీఫ్ గా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా మంచిది. క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి.

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. అధిక మోతదులో ప్రోటీన్ తీసుకోవడం వలన, క్యాల్షియం బాగా బయటకి వచ్చేస్తుంది. దీంతో, కిడ్నీ స్టోన్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. కాబట్టి, ప్రోటీన్ తక్కువ తీసుకోవడం మంచిది. అలా అని పూర్తిగా మానేయక్కర్లేదు. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు, సాల్ట్ తగ్గించాలి.

ఎక్కువ సాల్ట్ వలన స్టోన్స్ ఏర్పడతాయి. యూరిన్ లో ఎక్కువ సాల్ట్ స్టోన్ ఫార్మేషన్ కి దారితీస్తుంది. సాల్ట్ ని లిమిట్ గా తీసుకోవడం మంచిది. 1500 నుండి 2000 మిల్లీగ్రాముల వరకు సాల్ట్ తీసుకోవచ్చు. అంటే, అర టీ స్పూన్స్ సాల్ట్ ని తీసుకుంటే సమస్య ఉండదు. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు, కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకుని ఆచరించడం మంచిది.

Admin

Recent Posts