Immunity : రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. వీరికే ఒమిక్రాన్ సోకే అవకాశాలు ఎక్కువని చెబుతున్న నిపుణులు..!

Immunity : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఈ వేరియెంట్‌ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలోనే మళ్లీ రాత్రి కర్ఫ్యూలు, ఆంక్షలను విధిస్తున్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

if you have low Immunity power then these symptoms can appear

అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే కరోనా ఎక్కువగా సోకుతుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే.. శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..

1. తరచూ దగ్గు, జలుబు సమస్యలు వస్తున్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇవి బాక్టీరియా, వైరస్‌ల కారణంగా వస్తాయి కనుక తరచూ సూక్ష్మ జీవులు అటాక్‌ చేసి ఆ వ్యాధులను కలగజేస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచూ జలుబు, దగ్గు వస్తాయి. కనుక తరచూ ఈ సమస్యల బారిన పడుతుంటే అలాంటి వారు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలుసుకోవాలి.

2. కొందరిలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీని వల్ల రక్త నాళాలు వాపులకు గురవుతాయి. రక్తం సరిగ్గా అందదు. దీంతో చర్మం పసుపు రంగులోకి మారుతుంది. అలాగే చేతులు చల్లగా మారుతాయి. ఈ లక్షణాలు గనక ఉంటే వారి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.

3. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే.. తరచూ జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా మలబద్దకం లేదా విరేచనాలు అవడం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తరచూ వస్తుంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలుసుకోవాలి.

4. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే కొంత పనిచేసినా బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీంతోపాటు రక్తహీనత, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పైన తెలిపిన లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వారు తమ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. దీంతో వారు రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతోపాటు రోజూ తాజా పండ్లు, కూరగాయలను తింటుండాలి. వ్యాయామం చేయాలి. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే హెర్బల్‌ టీలను తాగుతుండాలి. దీని వల్ల కూడా రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

Share
Editor

Recent Posts