హెల్త్ టిప్స్

Diabetes Symptoms : ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయా..? ఎంత ప్రమాదం అంటే..?

Diabetes Symptoms : ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా, చాలామంది షుగర్, బీపీ తో బాధపడుతున్నారు. షుగర్, బీపీ వచ్చిందంటే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ముఖ్యంగా షుగర్ వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. మధుమేహం వెనుక ప్రధాన కారణం శారీరిక శ్రమ లేకపోవడం అని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు వలన కూడా, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఇంకాస్త ఎక్కువవుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ ని తీసుకోవడం వంటివి కూడా షుగర్ ని కలిగిస్తాయి.

అధిక బరువు ఉన్నవాళ్లు, వంశపార్యం పరంగా మధుమేహం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండడం మంచిది. అధిక బరువు, తప్పుడు ఆహార పదార్థాలను తీసుకోవడం, షుగర్ రావడానికి కారణం అవుతాయి. బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం కూడా చాలా మంచిది. ఇలా, ఈ పద్ధతుల్ని కనుక పాటించినట్లయితే, డయాబెటిస్ రిస్క్ బాగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.

if you have these symptoms then it might be diabetes

అలానే, చాలామంది వ్యాధి ముదిరే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ డయాబెటిస్ వచ్చే ముందు, ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనబడతాయి. సమయానికి వాటిని గుర్తించాలి. ఆలస్యం చేస్తే టైప్ టు డయాబెటిస్ అభివృద్ధి చెందుతుంది. తీవ్రమైన అలసట, అధిక దాహం వంటి లక్షణాలు ముందు కనబడతాయి.

ఆకలి పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటాయి. ఇలా లక్షణాలని గుర్తించి వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. షుగర్ ఉన్నట్లయితే, ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. నారింజ, కివి వంటివి మేలు చేస్తాయి. ఆల్కహాల్, వేయించిన ఆహార పదార్థాలు, బియ్యం, బంగాళదుంపలు ఎక్కువగా తీసుకోకూడదు.

Admin

Recent Posts